తెలుగులో బుల్లితెరలో మనసు మమత, మౌనరాగం తదితర ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ సీరియల్ నటి శ్రావణి కొండపల్లి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఘటన టాలీవుడ్ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.అయితే శ్రావణి ఆత్మహత్య అనంతరం ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇందులో భాగం ముఖ్యంగా శ్రావణి కాల్ డేటా ఆధారంగా ఆమె ఇతర వ్యక్తులతో మాట్లాడిన సంభాషణలను పరిశీలిస్తున్నారు.
అయితే తాజాగా శ్రావణి దేవరాజ్ అనే వ్యక్తి తో మాట్లాడిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది అయితే ఈ సంభాషణను ఒక సారి పరిశీలించినట్లయితే శ్రావణి తన చావుకి దేవరాజు కారణం కాదని, సాయి అనే వ్యక్తి తన చావుకి కారణం అంటూ ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది.
దీంతో అంతకు ముందు లీక్ అయినటువంటి ఫోన్ కాల్ సంభాషణలో దేవరాజు కూడా శ్రావణి ని బెదిరించినట్లు తెలిసింది.దీంతో మరింత క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పోలీసులు చనిపోయేముందు శ్రావణి మాట్లాడిన టువంటి ఫోన్ కాల్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్నారు.
దీంతో ఈ విషయంపై స్పందించిన దేవరాజ్ కూడా తనకు శ్రావణి ఆత్మహత్య కు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. అంతే గాక తాను సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు కూడా సహకరిస్తామని తెలిపాడు.
దీంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు ని మరింత వేగవంతం చేసారు.