1.స్కాట్లాండ్ యార్డ్ పోలీసు చీఫ్ రేసులో భారత సంతతి వ్యక్తి
ప్రతిష్టాత్మక స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ చీఫ్ రేసులో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పోలీస్ అధికారి నీల్ బసు నిలిచారు.
2.ఆ వీసాల గడువు పెంచిన కువైట్
2021 నవంబర్ 24 కంటే ముందు జారీ చేసిన కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్ వీసాలుగా మార్చుకునేందుకు గడువు పెంచుకునేందుకు అడ్మినిస్ట్రేటివ్ సర్కులర్ ను జారీ చేసినట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ అల్ మౌసా వెల్లడించారు.
3.బెహ్రైన్ లో కరోనా ఆంక్షలు ఎత్తివేత
గల్ఫ్ దేశం బెహ్రైన్ లో కరోనా ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
4.ఉక్రెయిన్ లో రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసిన అమెరికా
ఉక్రెయిన్ పై రష్యా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని తన రాయబార కార్యాలయంను ఖాళీ చేయనుంది.
5.అమెరికాలో తెలుగు యువకుడి హత్య
అమెరికాలో తెలుగు యువకుడు సత్య కృష్ణ చిత్తూరి అమెరికా లో హత్యకు గురయ్యారు.
6.కరోనా పై డబ్లుహెచ్ వో ప్రకటన
కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూ హెచ్ వో కీలక ప్రకటన చేసింది.కరోనా ఎఫెక్ట్ ఈ ఏడాది చివరినాటికి పూర్తి అవుతుందని ప్రకటించింది.
7.ఇటలీలో దొరికిన భారతీయ పురాతన విగ్రహం
భారతదేశం నుంచి దొంగిలించబడిన 1200 ఏళ్ల నాటి బౌద్ధ విగ్రహం బయటపడింది.మిలన్ లోని ఇండియన్ కన్సులెట్ చాలా ప్రత్యేకమైన అవలోకితేశ్వర పదమ పాణి విగ్రహాన్ని రికవరీ చేసుకుంది.
8.పోలాండ్ కు అమెరికా సైనికులు
ఉక్రెయిన్ పై అమెరికా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది అనే నిఘా వర్గాల సమాచారం మేరకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.పోలాండ్ కు అమెరికా సైనికులను పంపించేందుకు అధ్యక్షుడు జో బైడన్ ఆదేశాలు జారీ చేశారు.
9.ఫైలెట్ రహిత హెలికాప్టర్ ప్రయోగం సక్సెస్
అమెరికాలోని క్లింటకీలోని ఓ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఫైలెట్ లేకుండానే గాలిలో ప్రయాణించి , సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.ఆ దేశ ఆర్మీ అధికారుల పర్యవేక్షణ లో ఈ ప్రయోగం జరిగింది.
10.అమెరికాలో నాలుగో డోసు వాక్సిన్
అమెరికాలో నాలుగో డోసు కరోనా వాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.