తెలుగులో ప్రస్తుతం ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటి ఉమా దేవి సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతోంది.
కానీ ఇప్పటివరకు పలు చిత్రాలలో తాను నటించినటువంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.అయితే ఈ మధ్యకాలంలో టిఆర్పి పరంగా దూసుకుపోతున్న కార్తీక దీపం సీరియల్ లో హీరోయిన్ దీప బంధువు పాత్రలో నటించి తన కామెడీ నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.
దీంతో లేటు వయసులో ఉమా దేవికి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరుగుతోంది.అయితే నటి ఉమా దేవి గతంలో ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ కుటుంబ సభ్యుల గురించి సినీ ప్రేక్షకులతో పెద్దగా పంచుకోలేదు.
కానీ ఇటీవల కాలంలో నటి ఉమా దేవి తన కూతురుతో కలిసి సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్చల్ చేస్తోంది.అయితే ఉమా దేవి కూతురు పేరు యాగంటి తనూష.
ఇటీవలే ఈ అమ్మడు తన చదువును పూర్తి చేసుకొని డాన్స్ రంగంలో ఆసక్తి ఉండటంతో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో పలురకాల వీడియోలు, ఫోటోలతో బాగానే అలరిస్తోంది.
కాగా ప్రస్తుతం తనూష అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 5 వేల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీంతో కొందరు నెటిజనులు ఈ అమ్మడి ఫొటోలపై స్పందిస్తూ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో ట్రై చెయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి తనూష తన తల్లి మాదిరిగా సినిమా ఇండస్ట్రీకి వస్తుందో లేక తాను చదివిన చదువుకి తగిన ఉద్యోగం చూసుకుని సెటిల్ అవుతుందో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి ఉమా దేవి బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యారు.దీంతో ప్రస్తుతం నటి ఉమా దేవికి సినిమా ఆఫర్లు బాగానే తలుపు తడుతున్నట్లు సమాచారం.దాంతోపాటు నటి ఉమా దేవి కూడా యూట్యూబ్ వీడియోలు మరియు పలు షోలు, ఈవెంట్లు అంటూ బాగానే సంపాదిస్తోంది.
కానీ ఇప్పుడు ఉన్నటువంటి క్రేజ్ కొన్ని సంవత్సరాల ముందు గనక ఉమా దేవికి ఉండుంటే ప్రస్తుతం ఆమె మరింత మంచి హోదా లో ఉండేది.అయితే ఒకప్పుడు సినిమా అవకాశాలు లేని సమయంలో నటి ఉమా దేవి తీసుకున్నటువంటి నిర్ణయాలే ఆమె సినీ కెరీర్ ను దెబ్బతీశాయని అప్పట్లో పలు కథనాలు వినిపించాయి.
ఏదేమైనప్పటికీ మనలో ప్రతిభ ఉంటే సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.