తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలుస్తోంది.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు తీర్మానం చేశారు.
ఈ తీర్మానాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధినేత చంద్రబాబుకు పంపనున్నారు.ఈ మేరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ.టీడీపీ నేతలతో ఆయన సమావేశం అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నేతలతో చర్చించిన అనంతరం పోటీ అంశంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఇప్పటికే పోటీ అంశంపై కాసాని చంద్రబాబుతో చర్చలు జరపగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోటీ వద్దన్నట్లు తెలుస్తోంది.