తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపటిలో కలెక్టర్ల సదస్సు జరగబోతోంది.నూతన సచివాలయంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు పోలీస్ కమిషనర్లు పాల్గొననున్నారు.కాగా తెలంగాణ దశాబ్ది వేడుకలపై ప్రధానంగా ఈ సదస్సులో చర్చించనున్నారని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే సంబురాలను దాదాపు 21 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.అదేవిధంగా రాష్ట్రంలో హరితహారం, పోడు పట్టాల పంపిణీతో పాటు ఇళ్ల పట్టాల పంపిణీపై కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.