తెలంగాణ సీఎం నీటివనరుల సమస్యని అత్యధిక ప్రాధాన్యత గల అంశంగా గుర్తించి.యుద్ధప్రాతి పదికన తక్షణ చర్యలు చేపడుతున్నారు.
ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సగానికి సగం నీటి వివాదాలతో కొట్టుమిట్టాడు తున్నాయి.ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత లేని వాతా వరణం నెలకొంది.
ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ మహారాష్ట్ర సీఎంతో జరుపుతున్న జల దౌత్యం ప్రశంసలు అందుకుంటోంది.కోర్టులకు వెళ్లడం.
కేంద్రానికి ఫిర్యాదులు చేసుకోవడం.ప్రధానులకు మెమొరాండాలు ఇచ్చి పరిష్కారం కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తూ రాజ కీయ ప్రయోజనాలకై పాకులాడటం చూస్తున్నాం.
అనేక ప్రాజెక్టులు ముందుకు సాగక మధ్యలోనో.ఆదిలోనో ఆగిపోయి దీనంగా చూస్తున్నాయి.
గతంలో మహారాష్ట్రతోనే బాబ్లి సంఘటన తెలిసిందే.అప్పట్లో చంద్రబాబు మహరాష్ట్ర మీద యుద్ధమే ప్రకటించారు.
పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి వారిని అరెస్టు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.ఇంతటి తీవ్ర స్థితిగతులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్ మహరాష్ట్ర ప్రభుత్వంతో జల బంధుత్వం కలుపుకోవడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది.
జలవివాదాల్లో చిక్కుకుని ఒక్క అడుగైనా ముందుకేయని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలకు కేసీఆర్ ఆదర్శప్రాయుడిగా నిలిచారు.తెలంగాణ, మహరాష్ట్ర ప్రభుత్వాలు ఒకచోట కూచుని, ఒకటికి రెండు సార్లు.
మూడుసార్లు చర్చల మీద చర్యలు జరిపి,ఉభయులు ఒకరి రాష్ట్రంలో మరొకరు పర్యటించి, క్షేత్ర సమస్యలను అవగాహన చేసుకుని, ఇద్దరూ పరస్పర నీటి అవసరాలను గుర్తించి ఒక అవగాహనకు రావడాన్ని వివిధ రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి.
ఇంతటి తీవ్ర స్థితిగతులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్ మహరాష్ట్ర ప్రభుత్వంతో జల బంధుత్వం కలుపుకోవడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది.