తెలంగాణలో బ్యాంకులకు వరుస సెలవులు ప్రకటించిన ఉన్నతాధికారులు.. !

తెలంగాణలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నట్టు బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు.ఇకపోతే ఆదివారాలు, పండుగ పర్వదినాలు కాకుండా ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవులు ఉంటాయని వెల్లడించారు.

 Telangana Bank Officials Announced A Series Of Holidays To Banks , Telangana, Ba-TeluguStop.com

ఇక వరుసగా వస్తున్న సెలవులను చూస్తే.ఈనెల 27న నాలుగో శనివారం, 28 ఆదివారం, 29 హోలీ పర్వదినం ఈ 3 రోజులు బ్యాంకులు పనిచేయవని, అలాగే ఈనెల 30, 31 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయని పేర్కొన్నారు.

ఇకపోతే ఏప్రిల్‌ ఒకటో తేదీ బ్యాంకులు పని చేసినప్పటికీ ఖాతాదారుల లావాదేవీలు కొనసాగవని, ఏప్రిల్‌ 2వ తేదీ గుడ్‌ ఫ్రైడే బ్యాంకులు పనిచేయవని, ఏప్రిల్‌ 3న ఒక్క రోజు బ్యాంకులు పనిచేస్తాయన్నారు.

ఇక 4వ తేదీ ఆదివారం, 5వ తేదీ బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా సెలవులు వస్తున్నాయని వెల్లడించారు.6, 7, 8, 9 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి.10వ తేదీ రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవని అధికారులు వెల్లడించారు.ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించి తమ అవసరాలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube