స్టార్ డైరక్టర్ తేజ తనయుడు అమితవ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.తనయుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తేజ ఓ పీరియాడికల్ మూవీ ప్లాన్ చేశారు.
విక్రమాదిత్య టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట.తేజ తనయుడు అమితవ్ హీరోగా వస్తున్న విక్రమాదిత్య సినిమాకు 30 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.
మొదటి సినిమాకే అంత బడ్జెట్ ఏంటని ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.
మాములుగా అయితే తన సినిమాలని చాలా తక్కువ బడ్జెట్ లో చేస్తూ వచ్చే తేజ ఈసారి భారీ బడ్జెట్ తో ఈ విక్రమాదిత్య సినిమా చేస్తున్నాడు.
తేజ అంత బడ్జెట్ పెడుతున్నాడు అంటే సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉండి తీరుతుంది.అమితవ్ ని హీరోగా పరిచయం చేస్తూ 30 కోట్ల బడ్జెట్ మూవీ చేస్తున్నాడు తేజ.ఈ సినిమాని నల్లమలపు బుజ్జి ప్రొడ్యూస్ చేస్తున్నారు.18వ సెంచరీ కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది.సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ ఏర్పాటు చేస్తున్నారట.సినిమా నుంచి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు తేజ.
విక్రమాదిత్యతో పాటుగా సురేష్ బాబు చిన్న తనయుడు అభిరాం హీరోగా అహింస సినిమా చేస్తున్నాడు.
అహింస సినిమాని కూడా తేజ తన మార్క్ తో తెరకెక్కిస్తున్నారట.ఈ సినిమా కూడా అభిరాం కి సూపర్ క్రేజ్ తెచ్చిపెడుతుందని అంటున్నారు. అహింస సినిమా పూర్తి చేశాక విక్రమాదిత్య మీద పూర్తి ఫోకస్ పెడతారని తెలుస్తుంది.
తేజ తన తనయుడిని స్టార్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నడు.మొదటి సినిమాతోనే హీరోగా ఒక ముద్ర వేసుకునేందుకు అతన్ని సన్నద్ధం చేస్తున్నాడు.
అనుకున్న విధంగా విక్రమాదిత్య సక్సెస్ అయితే మాత్రం డైరక్టర్ గా తేజ హీరోగా అమితవ్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.