పేస్ బౌలర్ కావాలనుకొని చివరికి స్పిన్నర్ అయ్యాను అంటున్న టీమిండియా ఆటగాడు..!

క్రికెట్ ఆటలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి.ముఖ్యంగా ప్రపంచ క్రికెట్లో ఆటగాళ్లకు తెలియకుండానే వారి కెరియర్లే మారిపోతుంటాయి.

 Kuldeep Yadav Wants To Become Pace Bowler Eventually Became Spin Bowler, Spin Bl-TeluguStop.com

ప్రతి ఒక్క ఆటగాడి వెనక ఎంతో పోరాటం ఉంటుంది.అయితే ప్రపంచ క్రికెట్లో కొనసాగాలంటే ఆటగాళ్లు తమ జట్టు అవసరాలకి అనుగుణంగా మారాల్సి ఉంటుంది.

లేకపోతే క్రికెట్ నుంచి దూరం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి.అందుకే ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్న సచిన్ తన ఆశలను వదిలేసి కోచ్ చెప్పినట్టుగా బ్యాట్స్ మ్యాన్ అయ్యారు.

అయితే సచిన్ లో బౌలింగ్ టాలెంట్ ఎంత ఉందో తెలియదు కానీ అతనిలో బ్యాటింగ్ టాలెంటు గుర్తించిన కోచ్ కి మాత్రం ధన్యవాదాలు చెప్పాలి.ఎందుకంటే ప్రపంచ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్ మ్యాన్ గా సచిన్ ఎదిగారు.

యావత్ ప్రపంచానికి గాడ్ ఆఫ్ క్రికెట్ గా మారిన సచిన్ ఒకవేళ పేసర్ అయినట్లయితే ఆయనకు ఎటువంటి గుర్తింపు దక్కేదో ఊహలకి కూడా అందదు.అయితే సచిన్ లాగానే ఫాస్ట్ బౌలర్ కావాలని కుల్దీప్ యాదవ్ కూడా అనుకున్నారు.

కానీ ఒక ఇండియన్ క్రికెట్ కోచ్.కుల్దీప్ యాదవ్ లో మంచి స్పిన్ బౌలర్ ఉన్నారని గుర్తించారు.

Telugu Spin Bowler, Cricketers, Batsman, Indian Cricket, Indian, Kuldeep, Kuldee

ఐతే తాను ఫాస్ట్ బౌలరే కావాలనుకుంటున్నారని కుల్దీప్ సింగ్ చెప్పగా.స్పిన్ బౌలింగ్ చేస్తే నే నీకు మంచి కెరియర్ ఉంటుందని ఆ కోచ్ ఒత్తి మరీ చెప్పారు.దీంతో అయిష్టంగానే ఆయన స్పిన్ బౌలింగ్ చేయడం ప్రారంభించారు.ఆవిధంగా స్పిన్ బౌలింగ్ చేయడం ప్రారంభించిన కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం లో బెస్ట్ బౌలర్ గా కొనసాగుతున్నారు.

మిస్టరీ స్పిన్ బౌలర్ అనే ఒక అరుదైన బిరుదును కూడా పొందారు.ఏది ఏమైనా తెలియని టాలెంట్ ని గుర్తించి ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఉత్తమ ఆటగాళ్లను అందించడంలో కోచ్ లు కీలకమైన పాత్ర వహిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube