ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకుల లిస్టు రోజు రోజుకి పెరుగుతుంది.2019 కంటే 2024 ఎన్నికలు చాలా సీరియస్ గా సాగుతున్నాయి.ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ( YCP )వచ్చే ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగనుంది.
ఇదే సమయంలో టీడీపీ.జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
దీంతో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం జనసేన నాయకులు మధ్య మాటల తూటాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.ఇదిలా ఉంటే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి.
కేసులో ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.
ఈ పిటిషన్ పై మంగళవారం ద్విసభ్య ధర్మాసనం విచారించింది.ఈ క్రమంలో ఇద్దరు జడ్జీలు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది మధ్య.తీర్పులో ఏకాభిప్రాయం కుదరలేదు.
దీంతో ఎలాంటి తీర్పు వెలువరించలేదు.ఈ పరిణామంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు “నేరస్తుడిని” ఏ న్యాయస్థానము కాపాడదు అని చంద్రబాబు( Chandrababu Naidu )ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Somireddy Chandra Mohan Reddy ) స్పందించారు.“అదేంటో మా సంబరాలు రాంబాబు అప్పుడప్పుడు నిజాలే చెబుతాడు.32 కేసులు, 16 నెలల జైలు జీవితం, పదేళ్లుగా బెయిల్.ఇవన్నీ తప్పించుకోలేకపోయారు గా.” అని ట్వీట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.