తెలుగులో ఇటీవలే బింబిసారా, సీతారామం సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ రెండు సినిమాలో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా దూసుకుపోతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమాల్లో రెండు హిట్ అయినందుకు ఆయన చిత్ర బృందాలతో పాటుగా పరిశ్రమలో పలువురు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.బాగా ఈ సినిమాల పై స్టార్ హీరోయిన్ సైతం స్పందిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ రెండు సినిమాల విజయాలపై స్పందించిన పలువురు సెలబ్రిటీలు నెటిజెన్స్ మధ్యకాలంలో ఇటువంటి మంచి సినిమాలు రాలేదు అంటూ కొనియాడారు.ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా విజయం పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
బింబిసార, సీతారామం హిట్ అయ్యాయని ఆనంద పడిపోకూడదని, మూడు నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకూడదని ఆయన వ్యాఖ్యానించారు.తాజాగా ఈ రెండు సినిమాల విజయాలపై రివ్యూ ఇచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.
సీతారామం సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్య మని ఆయన తెలిపారు.

ఫస్ట్‌హాఫ్‌లో కశ్మీర్ పండితుల సమస్యను నిజాయితిగా చూపించారు.అలాగే హిందూ ముస్లిం వంటి అంశాలను తీసుకుని అద్భుతమైన ప్రేమ చిత్రంగా మలిచాడు డైరెక్టర్.ఓ అనాథను జావాన్‌గా తీసుకోవడం మంచి కాన్సెప్ట్ అన్నారు.
ఇలాంటి సున్నితమైన ఎన్నో సమస్యలను తీసుకుని మంచి సినిమాగా తీర్చిదిద్దిన డైరెక్టర్‌ను తప్పనిసరిగా అభినందించాల్సిన విషయం అని ఆయన అన్నారు.అనంతరం బింబిసార విజయం గురించి మాట్లాడుతూ.
ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ కథేఅని, కథలో కొత్తదనం లేకపోయిన డైరెక్టర్ వశిష్ఠ సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు.బింబిసారుడు అనే ఓ క్రూరమైన రాజు కథను తీసుకుని టైం ట్రావెలర్‌లో ఆ రాజు సున్నితంగా ఎలా మారాడో చూపించి ఈ చిత్రాన్ని ఆసక్తిగా తీశారు.
మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని తెలిపారు.అయితే ఈ మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకుండ, సినిమా రన్ టైం పెంచాలని ఆయన అన్నారు.
థియేటర్లో రెగ్యులర్ ఆడియన్స్ పెరిగేలా సినిమాలను తీసుకురావాలని ఆయన సూచించారు.