వందల కోట్ల హీరో ప్రస్తుత పరిస్థితి మరీ దారుణం, ఫ్యాన్స్ ఆవేదన

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) ఒకప్పుడు వంద కోట్ల వసూళ్లను ఈజీగా రాబట్టగలిగేవాడు.రోబో సినిమా( Robo movie ) తో ప్రపంచ వ్యాప్తంగా రజినీకాంత్ అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

 Tamil Super Star Rajinikanth Not Getting Buzz For Jailar Movie , Jailar Movie ,-TeluguStop.com

అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రజినీకాంత్ ఒక్క భారీ కమర్షియల్‌ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోలేక పోయాడు.

Telugu Jailar, Kollywood, Rajinikanth, Robo, Tamil, Tollywood-Movie

పాపం చాలా సినిమాలు ఆయన కి నిరాశను మిగిల్చాయి.తమిళం లో ఏ స్థాయిలో అయితే వసూళ్లు నమోదు అయ్యేవో అలాగే తెలుగు లో కూడా రజినీకాంత్‌ సినిమా లు వసూళ్లు దక్కించుకునేవి.కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

ఒకప్పటి మాదిరిగా ఇప్పుడు రజినీకాంత్‌ సినిమా లు అంటే తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు హడావుడి చేయడం లేదు.కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా తమిళనాడు లో కూడా ఒకప్పుడు ఉన్న క్రేజ్ రజినీకాంత్‌ కు లేదేమో అనిపిస్తుంది.

వయసు మీద పడుతున్నా కూడా సినీ ప్రేమికులు రజినీకాంత్‌ ను అభిమానించే వారు.కానీ ఆయన పెద్దగా సక్సెస్ లను దక్కించుకోలేక పోయిన కారణంగా జనాలు ఆయన గురించి మాట్లాడుకోవడం లేదు.

Telugu Jailar, Kollywood, Rajinikanth, Robo, Tamil, Tollywood-Movie

దాంతో రజినీకాంత్‌ క్రేజ్ మెల్ల మెల్లగా తగ్గుతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో రజినీకాంత్ గురించి ఏ రేంజ్ లో గతంలో ప్రచారం జరిగేదో అందరికి తెల్సిందే.ఇప్పుడు మాత్రం అంత సీన్ లేదు.ప్రచారం లేదు అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.వచ్చే వారం ఈ సూపర్ స్టార్‌ జైలర్ సినిమా( Jailar movie ) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.అయినా కూడా జనాలు అక్కడ ఇక్కడ ఆ సినిమా గురించి కానీ.

ఇతర విషయాల గురించి కానీ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.జైలర్ సినిమా సక్సెస్ అయితే రజినీకాంత్ తన పూర్వ వైభవం పొందుతాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube