తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నాగచైతన్య( Nagachaitanya ) ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన నటించిన దూత ( Dutha )అనే వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.అయితే తాజాగా ముంబై వెళ్ళినటువంటి ఈయన నటి తమన్నాతో కలిసి ఒకే సెట్ లో సందడి చేయడంతో వీరిద్దరూ కలిసి ఏదైనా కొత్త షో ప్రారంభిస్తున్నారా అన్న సందేహాలు రాక మానదు.
కానీ నాగచైతన్య మాత్రం తన సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తమన్న పై ప్రాంక్ చేశారని తెలుస్తుంది.
నాగ చైతన్య సెట్‌లోకి వెళ్లగానే తమన్నా ( Tamannah ) మేకప్ వేసుకుంటూ కనిపించారు.ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? అంటూ తమన్న అడగడంతో వెంటనే నాగచైతన్య అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) వారు పిలిస్తే ఇక్కడికి వచ్చాను అని చెప్పగా ఇక్కడ నేను షూటింగ్ చేసే లొకేషన్ అనడంతో లేదు నా సెట్ అంటూ నాగచైతన్య కూడా గొడవ పడతారు అంతలోపు తమన్నా తన సంబంధించిన పేపర్స్ కూడా చూపించగా నాగచైతన్య కూడా తన టీం కి ఫోన్ చేస్తారు దీంతో తమన్నా కూడా వారితో మాట్లాడుతుంది.కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఒకే సెట్‌లో రెండు మూడు షూటింగ్స్ పెట్టుకుంటున్నారని వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు.
ఇలా ఫోన్ పెట్టేసిన తర్వాత నాగచైతన్యను తమన్న ఒక గదిలోకి తీసుకువెళ్లగా అక్కడికి వెళ్ళినటువంటి నాగచైతన్య ఇది సినిమా షూటింగ్ లోకేషన్ లా లేదు.చిన్న పిల్లల పుట్టిన రోజు పార్టీ లాగా ఉంది అంటూ మాట్లాడుతారు వెంటనే తమన్న క్లాత్ కప్పి ఉన్న ఒక బోర్డుపై కవర్ తీస్తారు.వెల్ కమ్ టు అమెజాన్ ప్రైమ్ నాగ చైతన్య అని బోర్డ్ పై రాసి ఉంటుంది అది చూసిన నాగచైతన్య థాంక్యూ సో మచ్ అని చెబుతారు వెంటనే నాగచైతన్య ఒక కవర్ ఇవ్వగా అందులో తమన్నా ఫ్రాంక్ చేయబోతుంది అని రాసి ఉంటుంది.మొత్తానికి వీరిద్దరూ కూడా దూత ప్రమోషన్లలో భాగంగానే ఇలాంటి ఒక ఫ్రాంక్ వీడియో చేసి తమ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేశారని తెలుస్తోంది.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన మొట్టమొదటి దూత వెబ్ సిరీస్ డిసెంబర్ ఒకటి నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు.