అప్పుడప్పుడు నటీనటులు తోటి నటీనటులపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.వాళ్ళ మనసులో ఉన్న మాటలు బయటికి చెప్పేస్తుంటారు.
అయితే తాజాగా తమన్నా( Tamanna ) కూడా రామ్ చరణ్, నాగచైతన్యలపై సంచలనం కామెంట్లు చేయగా ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతున్నాయి.తను ఎటువంటి కామెంట్లు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా ఏలేస్తుంది.
స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది.మంచి మంచి హిట్టులు అందుకొని బ్లాక్ బస్టర్ హిట్టు సొంతం చేసుకొని మంచి అభిమానం సంపాదించుకుంది.
ఒకప్పుడు రొమాంటిక్ సీన్లకు భయపడిన ఈ బ్యూటీ ఇప్పుడు బోల్డ్ కంటెంట్ లో కూడా చేయడానికి ఏమాత్రం మొహమాట పడటం లేదు.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బాగా బిజీగా ఉంది.రీసెంట్ గా లస్ట్ స్టోరీ 2 ( Lust Stories 2 ) సినిమాలో బోల్డ్ సీన్స్ లో ఎంతలా రెచ్చిపోయిందో చూసాం.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో తను బాలీవుడ్ లో మన తెలుగు హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తను చాలామంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని.అయితే తనకు బాగా నచ్చింది మాత్రం రామ్ చరణ్, చైతన్య అని తెలిపింది.వీళ్ళ ఇద్దరికీ అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలుసని.అమ్మాయిలని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసని.
అంత గొప్పగా వాళ్ళ తల్లిదండ్రులు పెంచారని అన్నది.
వారి విషయంలో చిరంజీవి సార్, నాగార్జున సార్ లకు( Chiranjeevi, Nagarjuna ) హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని అన్నది.ఇక ఇండస్ట్రీలో తను టాప్ హీరోయిన్ అవుతానని నమ్మిన మొదటి వ్యక్తి చిరంజీవి అని అన్నది.చరణ్ తో( Ram Charan ) కలిసి సినిమా చేస్తున్న టైంలో తనకు ఆ విషయాన్ని చెప్పారట.
నాగార్జున సార్ తో నటించడం చాలా బాగా అనిపిస్తుందని.చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది .
దీంతో ఆమెతో నటించిన ఇతర హీరోల అభిమానులు బాగా ఫైర్ అవుతున్నారు.అంటే వాళ్ళిద్దర్నీ పైకి ఎక్కిపిస్తున్నావు.మరి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో ఎందుకు నటించవు అంటూ ఏకిపారేస్తున్నారు ఫ్యాన్స్.ఏదేమైనా తమన్నా మాత్రం కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు అయితే టాప్ పొజిషన్ లోనే ఉంది.
ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా కూడా తనకు దక్కవలసిన క్రేజ్ దక్కుతూనే ఉంది.
ఇక ఆమె జైలర్ సినిమాలో( Jailer Movie ) చేసిన స్పెషల్ సాంగ్ నటించగా ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్లో, రీల్స్ లో బాగా హడావిడి చేస్తుంది.
అందులో తను హాట్ స్టెప్స్ తో బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇక మరిన్ని సినిమాలలో కూడా బాగా బిజీగా ఉంది.