సిడ్నీ: స్విమ్మర్‌పై షార్క్ దాడి.. చూస్తుండగానే రెండుగా చీల్చేసి, 60 ఏళ్ల తర్వాత బీచ్ మూసివేత

సరదాగా సముద్రంలో ఈత కొట్టి సేద తీరుదామని వచ్చిన కొందరిపై ఆకస్మాత్తుగా షార్క్ దాడి చేసి చూస్తుండగానే తినేస్తే.ఇలాంటివి మనం హాలీవుడ్ సినిమాల్లోనే చూసి వుంటాం.

 Sydney Beaches Close After First Fatal Shark Attack In 60 Years, New South Wales-TeluguStop.com

అచ్చం ఇదే తరహా ఘటన రియల్‌గా జరిగితే.వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది కదూ.ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇదే ఘటన వెలుగుచూసింది.దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఆ బీచ్‌ల వద్దకు టూరిస్ట్‌ల రాకపై నిషేధం విధించింది.

బోండి, బ్రోంటే సహా అనేక బీచ్‌లను ప్రభుత్వం మూసివేసింది.దాదాపు 60 ఏళ్ల తర్వాత షార్క్ దాడిలో మనిషి మరణించడం అక్కడ ఇదే తొలిసారి.

షార్క్‌లకు ఎరవేయడానికి ఉపయోగించే డ్రమ్ లైన్‌లను ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.స్విమ్మర్‌ను బలి తీసుకున్న షార్క్.

ఆ ప్రాంతంలో వుందో లేదో తెలుసుకోవడానికి డ్రోన్‌లను రంగంలోకి దింపారు.సిడ్నీకి దక్షిణంగా 20 కిలోమీటర్ల దూరంలోని బోటనీ బే ఎంట్రీకి సమీపంలో వున్న లిటిల్ బే బీచ్‌లో బుధవారం మధ్యాహ్నం ఒక షార్క్ స్విమ్మర్‌పై దాడి చేసి తినేసింది.

అయితే షార్క్ దాడిలో మరణించిన ఆ వ్యక్తి ఎవరనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు.

ఈ ఘటనతో ముర్రే రోజ్ మలబార్ మ్యాజిక్ ఓషన్ స్విమ్‌కి కొన్ని రోజుల ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది.

ఇక్కడికి దగ్గరలోని బీచ్‌లో వేలాది మంది ఈతగాళ్లు హాజరయ్యే వార్షిక ఛారిటీ ఈవెంట్ ఇది.పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని.ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే మార్చి 6న నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

న్యూసౌత్‌వేల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ ప్రతినిధి మాట్లాడుతూ.దాదాపు 9.8 అడుగుల పొడవున్న తెల్ల సొరచేప ఈ దాడికి కారణంగా భావిస్తున్నామన్నారు.1963 తర్వాత సిడ్నీలో జరిగిన తొలి ప్రాణాంతకమైన షార్క్ దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు.ఎండలు పెరుగుతున్నందున ప్రజలు సేద తీరేందుకు సముద్రాన్ని ఆశ్రయిస్తున్నారు.

ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో బీచ్‌లకు దూరంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Sydney Beaches Close After First Fatal Shark Attack In 60 Years, New South Wales Department Of Primary Industries, Sydney , Bondi, Bronte, Murray Rose Malabar Magic Ocean Swim, Hollywood, Little Bay Beach, - Telugu Bondi, Bronte, Hollywood, Bay Beach, Murrayrose, Wales Primary, Sydney, Sydneybeaches

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube