దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్( Sushant Singh Rajput ) గురించి మనందరికీ తెలిసిందే.కాగా తాజాగా సుశాంత్ సింగ్ సోదరీ ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది.
ప్రియాంక సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయినా రియా చక్రవర్తి( Riya chakravarthy ) పై తీవ్రస్థాయిలో విరుచుకుబడింది.రియాని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఆ ట్వీట్ సంచలనంగా మారింది.తాజాగా రియా చక్రవర్తి తాను సినిమాల్లో నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఆ విషయం పై ప్రియాంక సింగ్( Priyanka Singh ) ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్ చేసింది.కాగా ప్రియాంక సింగ్ తన ట్విట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.మీరు ఎందుకు భయపడతారు.మీరు చేసే వృత్తి వేశ్య.ఎప్పటికీ అలాగే కొనసాగుతారు.మీకు మద్దతు ఇస్తున్న పాలకులను చూసే మీకు అంత ధైర్యం అన్ని రాసుకొచ్చింది.
కాగా రియా చక్రవర్తి రోడిస్ 19 షో లో నటిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.పోయినవారు ఎలాగో తిరిగిరారు.
కానీ ఇప్పుడు ఎందుకు భయపడాలి అలా భయపడే వారు వేరే విధంగా ఉంటారు అని రియా చక్రవర్తి తెలిపింది.
ఇకపోతే హీరో సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవడంలో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి హస్తం ఉంది అంటూ ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే.అదే విషయంపై రియా చక్రవర్తి జైలుకు కూడా వెళ్లి వచ్చింది.కాగా సుశాంత్ సింగ్ రాజపుత్ జూన్ 14 2020 లో బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రియుడు మరణ వార్తను జీర్ణించుకోవడానికి ఆ బాధ నుంచి బయటకు రావడానికి ప్రియా కు చాలా కాలం సమయం పట్టిందని చెప్పవచ్చు.ఇప్పటికీ అభిమానులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.