ఛాన్స్ వస్తే ఐకాన్ స్టార్ తో తప్పకుండ చేస్తానంటున్న స్టార్ డైరెక్టర్!

తమిళ్ స్టార్ డైరెక్టర్లలో వెట్రిమారన్ ( Vetrimaaran ) ఒకరు.ఈయన కోలీవుడ్ ( Kollywood ) లో మంచి మంచి సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.

 Vetrimaran Confirms Talks With Allu Arjun, Allu Arjun, Vetrimaaran, Viduthalai,-TeluguStop.com

ఇక ఇప్పుడు ఈయన తమిళ్ లో విడుదలై సినిమాను చేసారు.ఈ సినిమా విడుదల పేరుతో తెలుగులో రిలీజ్ అవుతుంది.

ఈ క్రమంలోనే వెట్రిమారన్ తాజాగా ‘విడుదల’ ప్రీమియర్స్ సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఈయన పలు ఆసక్తికర విషయాలను తెలుగు మీడియాతో పంచుకున్నారు.

మన స్టార్ హీరోలతో ఈయన సినిమాలు చేయడంపై ఈయన స్పందించారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి కూడా ఈయన కామెంట్స్ చేసారు.

వెట్రిమారన్ మాట్లాడుతూ.ఆడుకాలం మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చెన్నైలో కలిశానని.

తమిళ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైనా స్టోరీ ఉంటే చెప్పండి సర్ అని అడిగారని అన్నారు.

Telugu Allu Arjun, Pushpa, Vetrimaaran, Viduthalai-Movie

ఆ తర్వాత వడ చెన్నై మూవీలో అల్లు అర్జున్ కి పవర్ ఫుల్ రోల్ చెప్పానని కానీ అప్పుడు కొన్ని కారణాల రీత్యా కుదరలేదని అలా ఆ సినిమా అల్లు అర్జున్ మిస్ అయ్యాడని తెలిపాడు.అయితే ఆ తర్వాత వడ చెన్నై స్టోరీని మార్చి వివరించారని కానీ ఈ మూవీని అల్లు అర్జున్ మిస్ చేసుకున్నారు.ఇక ముందు ముందు అయినా అల్లు అర్జున్ తో అవకాశం వస్తే తప్పకుండ సినిమా చేస్తానని తెలిపారు.

Telugu Allu Arjun, Pushpa, Vetrimaaran, Viduthalai-Movie

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాను చేస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను బడ్జెట్ పరంగా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి మొన్ననే ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యి సూపర్ టాక్ తెచ్చుకుంది.పార్ట్ 1 లో ఉన్న పాత్రలే కాకుండా పార్ట్ 2 లో సరికొత్త పాత్రలను కూడా పుష్ప 2 లో పరిచయం చేయబోతున్నాడు సుకుమార్.

మరి ఈ పార్ట్ 2 లో భాగం అయ్యే ఆ స్టార్స్ ఎవరు ముందు ముందు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube