సూప‌ర్ఉమెన్ మూవీ ఇంద్రాని నుండి న‌టి ఫ్ర‌నైట జిజిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

భార‌త‌దేశపు మొట్ట‌మొద‌టి సూప‌ర్‌గ‌ర్ల్ మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం `ఇంద్రాని`.ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కి, మేకింగ్ వీడియోకి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది.

 Superwoman Movie Indrani Releases Nighty Freight Jigsaw First Look Poster , Yani-TeluguStop.com

తాజాగా ఈ చిత్రం నుండి న‌టి ఫ్ర‌నైట జిజిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.ఈ సంద‌ర్భంగా ఫ్ర‌నైట‌ పాత్ర చాలా ముఖ్యమైనదని, ఇంద్రాణితో సమానంగా ఉంటుంది కాబట్టి అనేక రౌండ్ల ఆడిషన్స్ తర్వాత ఫ్రనైటా ఆ పాత్ర కోసం ఎంపిక చేయడం జ‌రిగింద‌ని మేకర్స్ పేర్కొన్నారు.

ద‌ర్శ‌కుడు, నిర్మాత స్టీఫెన్ మాట్లాడుతూ – “ ఇంద్రాణి సినిమా మూడు పాత్రల చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్.నేను రూపొందించాలనుకుంటున్న సూపర్ గర్ల్ సిరీస్‌కి సరికొత్త రూపాన్ని ఇవ్వడానికి కొత్త టాలెంట్‌తో ముందుకు వెళ్లాలనుకున్నాను.

అందులో భాగంగానే కొత్త న‌టీన‌టుల‌ని ఎంపిక చేసుకోవ‌డం జ‌రిగింది.ఫ్రనైటా అద్భుతమైన నటి మ‌రియు అద్భుతమైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా.

యానియా భరద్వాజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో లీడ్ లో ఉండ‌గా, ఫ్ర‌నైట జిజిన మరియు గరిమా కౌశల్ డ్యాన్స్ నంబర్స్‌లో లీడ్‌గా ఉంటారని మరియు సినిమాలోని అన్ని పాటలు సినిమాను పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మారుస్తాయని తెలిపారు.

గ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ స్టాన్లీ సుమ‌న్ బాబు మాట్లాడుతూ – “మా విజ‌న్ ను న‌మ్మి అమెరికాలోని చికాగో నుండి సుధీర్ వేల్పుల గారు & కెకె రెడ్డి గారు మరియు యుఎస్ఎలోని వర్జీనియా నుండి జే జి.సేన్ గారు ఈ చిత్రానికి కో- ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఈ సంద‌ర్భంగా వారికి మా హృద‌య పూర్వ‌క‌ ధన్యవాదాలు తెలియ‌జేస్తున్నాను“ అన్నారు.

ప్రస్తుతం ఇంద్రాణి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా 27 అక్టోబ‌రు 2022న విడుద‌ల చేయ‌నున్నారు.

న‌టీన‌టులు: యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ దుహ‌న్‌ సింగ్, ష‌త‌ఫ్ అహ్మ‌ద్‌, గ‌రీమా కౌశ‌ల్‌,ఫ్ర‌నైట జిజిన త‌దిత‌రులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube