సూపర్ స్టార్ అనే బిరుదు నాకు ఎప్పుడు పెద్ద తలనొప్పినే… రజనీకాంత్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు రజనీకాంత్ ( Rajinikanth ) కు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వయసు పైబడినప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 The Title Of Superstar Has Always Been A Big Headache For Me, Rajinikanth, Thama-TeluguStop.com

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే జైలర్( Jailer ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

నెల్సన్‌ ( Nelson )దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కాబోతోంది.

Telugu Jailer, Nelson, Rajinikanth, Thamannah-Movie

ఈ విధంగా ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రజనీకాంత్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.రజనీకాంత్ సూపర్ స్టార్ అనే బిరుదుతో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఇటీవల కాలంలో సూపర్ స్టార్ అనే బిరుదు పై పెద్ద ఎత్తున వివాదం జరిగింది అదే విధంగా జైలర్ సినిమాలో హుకుమ్‌.పాటలో సూపర్‌ స్టార్‌ అనే పదం వచ్చింది.

ఆ పదాన్ని తొలగించాలని డైరెక్టర్‌కి చెప్పాను.నిజానికి.

సూపర్‌ స్టార్‌ అనే పదం నాకు ఎప్పుడు పెద్ద తలనొప్పి గానే మారింది అంటూ రజనీకాంత్ కామెంట్ చేశారు.

Telugu Jailer, Nelson, Rajinikanth, Thamannah-Movie

1977లోనే దీనిపై పెద్ద వివాదం జరిగింది.అప్పట్లో నటుడు కమలహాసన్‌, శివాజీ గణేషన్‌( Kamala Haasan , Shivaji Ganesan ) ప్రముఖ నటులుగా రాణిస్తున్నారు.అలాంటి సమయంలో స్థానం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి సూపర్ స్టార్ అనే పట్టం నాకు కట్టారు.

ఇలా సూపర్ స్టార్ అనే బిరుదునాకు ఇవ్వటం వల్ల అప్పట్లో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారిందని ఈ సందర్భంగా రజినీకాంత్ సూపర్ స్టార్ అనే బిరుదు కారణంగా తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా ( Thamannah ) నటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube