ది లెజెండ్ హీరోని కలిసిన సూపర్ స్టార్.. ఫోటో వైరల్?

శరవణ స్టోర్స్‌ అధినేత అరుళ్‌ శరవణన్‌ ఎన్నో వ్యాపారాలతో వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈయనకు సినిమాపై మక్కువతో ఏకంగా 51 సంవత్సరాల వయసులో వెండితెరపై ది లెజెండ్ అనే సినిమాతో హీరోగా నటించారు. ‘శరవణ ప్రొడక్షన్స్‌’ బ్యానర్ లో జేడీ- జెర్రీ దశకత్వంలో ఈ చిత్రాన్ని సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో శరవణన్ నిర్మించారు.ఈ సినిమా జులై 28వ తేదీ విడుదలై పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

 Super Star Who Met The Legend Hero Photo Viral , Saravana Productions, Arul Saravana, The Legend, Rajinikanth-TeluguStop.com

అయితే ఈయన హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా ఈయన షాపింగ్ మాల్స్ కి మాత్రం విపరీతమైన పబ్లిసిటీ వచ్చిందని చెప్పాలి.ఇకపోతే ఈ సినిమాలో ఈయన నటనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మీమర్స్ మీమ్స్‌ క్రియేట్ చేయడంతో దేశవ్యాప్తంగా ఈయన సినిమాకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది.

అయితే ఈ పాపులారీటీ పాజిటివ్ గా కాకుండా నెగటివ్ గా వచ్చింది.ఇదిలా ఉండగా తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ది లెజెండ్ హీరోని కలిసి ఏకంగా ఆయనకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Arul Saravana, Rajinikanth, Saravana, Legend-Movie

ఇలా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయనకు నమస్కారం చేయడం ఏంటి? అసలు ఈ ఫోటో వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయానికి వస్తే.సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అన్నాత్తే సినిమా చిత్రీకరణ అలాగే,శరవణన్ నటించిన ది లెజెండ్ సినిమాలు రెండు కూడా చెన్నైలోని గోకులం స్టూడియోలో జరిగాయి.ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలు ఒకే చోట షూటింగ్ జరగడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ శరవణన్ కలిశారు.ఆ సమయంలో దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube