సడెన్‌గా ఏదైనా పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం డల్‌గా, కాంతి హీనంగా ఉంటే ఎంతో బాధ కలుగుతుంది.అసలు అలాంటి ముఖంతో బయటకు వెళ్లడానికే ఇష్టపడరు.
ఈ క్రమంలోనే ఇన్స్టెంట్గా ముఖాన్ని ఎలా గ్లోగా మార్చుకోవాలో తెలియక తెగ సతమతమైపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీని పాటిస్తే కేవలం పావు గంటలోనే ముఖాన్ని అందంగా, గ్లోగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్లో మూడు స్పూన్ల పాలు, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంతో ముఖాన్ని, మెడను క్లిన్సింగ్ చేసుకుని.గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి.
క్లెన్సింగ్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం టైట్ గా మారుతుంది.ఇప్పుడు రెండు స్పూన్ల షుగర్‌ను తీసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి, వన్ టేబుల్ స్పూన్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్, మూడు స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్యాక్‌లా ముఖానికి, కావాలీ అనుకుంటే మెడకు అప్లై చేసుకోవాలి.ఐదు లేదా పది నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి.అప్పుడు సగం టమాటో ముక్కతో మెల్ల మెల్లగా చర్మాన్ని రుద్దు కుంటూ కూల్ వాటర్‌తో ముఖాన్ని, మెడని క్లీన్ చేసుకోవాలి.
ఇలా ఏదైనా పార్టీకి, ఫంక్షన్‌కి వెళ్లే ముందు చేస్తే చర్మంపై దుమ్ము, ధూళి, మురికి తొలగి పోయి ముఖం కాంతి వంతంగా, అందంగా మెరిసి పోతుంది.అదే సమయంలో ముఖం తెల్లగా కూడా మారుతుంది.