యువ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో 100 కోట్ల క్లబ్ లో చేరాడు.చిన్న సినిమాగా రిలీజైన కార్తికేయ 2 ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది.
ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు.సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తుంది.
ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.కుమారి 21 ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూర్య ప్రతాప్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
కొన్నాళ్లుగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో సుకుమార్ డిజప్పాయింట్ గా ఉన్నాడట.రషెస్ చూసిన సుకుమార్ కొన్ని మార్పులు సూచించారట.అంతేకాదు కొన్ని సీన్స్ రీ షూట్స్ కూడా చేయాలని అన్నారట.నిఖిల్ అండ్ టీం 18 పేజెస్ రీ షూట్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
మరి కార్తికేయ 2 తర్వాత నిఖిల్ 18 పేజెస్ తో కూడా హిట్ ఫాం కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.లవ్ స్టోరీ సినిమాగా వస్తున్న 18 పేజెస్ సినిమాలో నిఖిల్ అనుపమల జోడీ అదిరిపోతుందని అంటున్నారు.
సరైన డేట్ చూసి సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.సినిమా మొదలు పెట్టి దాదాపు రెండేళ్లు అవుతుంది.