రష్మీతో పెళ్లి గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేసిన సుధీర్.. పెళ్లి చేసుకునేది అప్పుడేనంటూ?

సుధీర్ రష్మీ( Sudigali Sudheer Rashmi Gautam ) జోడీ బుల్లితెరపై హిట్ జోడీ అనిపించుకోగా ఈ జోడీ ఈ మధ్య కాలంలో ఒకే స్టేజ్ పై కనిపించిన సందర్భాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే.సుధీర్ రష్మీ పెళ్లి గురించి వార్తలు ప్రచారంలోకి రావడం కొత్తేం కాదు.

 Sudigali Sudheer Comments About Rashmi Details Here Goes Viral In Social Media-TeluguStop.com

గతంలో కూడా ఈ జోడీ గురించి వార్తలు వినిపించాయి.రష్మీ, సుధీర్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

కాలింగ్ సహస్ర మూవీ( Calling Sahasra ) ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ ఎన్నో సందేహాలకు చెక్ పెట్టారు.

డిసెంబర్ నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.రష్మీని పెళ్లి చేసుకుంటానని జరుగుతున్న ప్రచారం నిజం కాదని మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ కు మాత్రమే పరిమితమని చెప్పుకొచ్చారు.సమయం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందంటూ తన పెళ్లి గురించి సుధీర్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు.

నేను, రష్మీ ఇద్దరం కథలు వింటున్నామని సుధీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మా ఇద్దరికీ కామన్ గా నచ్చిన కథ ఇప్పటివరకు దొరకలేదని మంచి కథ దొరికితే కలిసి నటించడానికి అభ్యంతరం లేదని సుధీర్ అన్నారు.ఈరోజుల్లొ ఒక మూవీ హిట్టైతే సినిమా సక్సెస్ కు కంటెంట్ కారణమని నన్ను దృష్టిలో పెట్టుకుని మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలని భావించే వాళ్లకు ఈ మూవీ నచ్చుతుందని సుధీర్ తెలిపారు.ఈ సినిమా నాకు మూడో సినిమా అని సుధీర్ ( Sudheer )కామెంట్లు చేశారు.

నా సినిమాల నిర్మాతలకు లాభాలు వస్తే చాలని సుధీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.సినిమా చూసిన జనాలు కూడా పాజిటివ్ గా స్పందిస్తే ఆనందిస్తానని సుధీర్ అన్నారు.

డైరెక్టర్ ఏది చెబితే నేను అదే చేస్తానని సుధీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.డైరెక్టర్ కు సలహాలు, సూచనలు ఇవ్వనని సుధీర్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube