వింత: గత 19 ఏళ్లగా చేతిపంపునుండి పారుతున్న నీరు... ఎవరూ కొట్టకుండానే వస్తోంది?

ఈ ప్రపంచంలో తాగడానికి గుక్కెడు నీళ్లులేక అలమటించేవారు ఎందరో వున్నారు.వారి సమీప ప్రాంతాలలో ఎంత తవ్వినా నీరు పడదు.

 Strange Water Flowing From Hand Pump For Last 19 Years , Water, Pump, Water Com-TeluguStop.com

బోర్ల సహాయంతో వందల అడుగులు కన్నం చేసినా అదృష్టం వారిని వరించదు.అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే అవుతుంది.

అయితే అక్కడ వేసిన ఓ చేతి బోరు ఎవరి అవసరం లేకుండానే, అంటే.ఎవరు కొట్టకుండానే నిరంతరంగా పారుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే, చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా, సుక్మా బ్లాక్‌లోని మరోకి గ్రామంలో దాదాపు 19ఏళ్ల క్రితం ఓ తాగునీటి బోరు వేశారు.అక్కడ కేవలం 10అడుగుల లోతులోనే నీరు పడటంతో అధికారులు బోర్ వేసి వెళ్లిపోయారు.సదరు గ్రామంలో సుమారు 200 కుటుంబాలు జీవనం ఉంటున్నాయి.ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమంటే, ఈ పంపును నుంచి ఎవరూ కొట్టకుండానే నీరు ధారాళంగా ప్రవహిస్తోంది.

అలా 19 ఏళ్ల నుంచి ఎవరూకొట్టకుండానే చేతిపంపు నుంచి మంచినీరు నీరు వస్తుంది.

తాజాగా ఈ పంపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూడటంతో తెగ వైరల్‌ అవుతోంది.అక్కడి స్థానికులు ఇక్కడ పాతాళగంగ వుంది అని, అందుకే ఏడాది పొడవునా ఇలా నిత్యం మంచినీరు ప్రవహిస్తుందని చెప్పుకొస్తున్నారు.అంతేకాకుండా సీజన్‌తో పని లేకుండా, మండు వేసవిలో కూడా దానినుండి నీరు రావడం కొసమెరుపు.

దాంతో అక్కడి 200 కుటుంబాల ప్రజలు మంచి నీరు కోసం బయటకి పోవాల్సిన అవసరం లేకుండా పోతోంది.మనం చూస్తూ ఉంటాం… వేసవిలో చాలా చోట్ల వేరే ప్రాంతం నుంచి ట్యాంకులతో నీటిని తెప్పించుకుంటారు.

కానీ వీరికి ఆ ఖర్మ పట్టలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube