తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో వింత ఘటన చోటు చేసుకుంది.గ్రామంలో ఉన్న మహాలక్ష్మీ ఆలయంలో అద్భుత ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆలయంలోని అమ్మవారి విగ్రహం ముఖంలో జీవకళ ఉట్టిపడుతోంది.గతంలో విగ్రహా రూపానికి, ప్రస్తుత విగ్రహా రూపానికి చాలా తేడా ఉన్నట్లు స్థానిక ప్రజలు, భక్తులు గుర్తించారు.
అంతేకాదు అమ్మవారి కళ్లు ఆర్పుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.కానీ ఎందుకు ఇలా జరిగిందే తెలయలేదని తెలిపారు.
కాగా ఇదంతా అమ్మవారి మహిమేనని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ వింతను చూసేందుకు ప్రజలు, భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు.