1987లో తమిళ నటుడు దర్శకుడు కే భాగ్యరాజా, నువ్వు అందించిన సినిమా ఎంగ చిన్న రాజా.అప్పట్లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
సినిమాలో భాగ్యరాజా సరసన రాధా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తో ఇచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగాబాగానే వసూళ్లను సాధించింది.ఇదే సినిమాను బాలీవుడ్ లో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ బేట అనే పేరుతో హిందీలో రీమేక్ చేశారు.1992లో నిర్మించిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా ఘన విజయం సాధించడమే కాకుండా అత్యధికంగా వసూళ్ళను సాధించిన సినిమాగా కూడా నిలిచింది.
ఎంగ్ చిన్న రాజా సినిమాలో ని మదర్ సెంటిమెంట్ నచ్చి హీరో కృష్ణ అప్పట్లో తెలుగులో రీమేక్ హక్కులను కొన్నారు.హీరో కృష్ణ తాను హీరోగా పద్మాలయ బ్యానర్ పై ఈ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నాడు.
ఈ సినిమాలో తల్లి పాత్ర కోసం సీనియర్ నటి వాణిశ్రీ ని సంప్రదించారు.కానీ విజయనిర్మల తో ఏర్పడిన వివాదం కారణంగా సినిమాలో నటించడానికి వాణిశ్రీ అంగీకరించలేదు.
ఇక హీరో కృష్ణ విజయశాంతి కలసి నాగాస్త్రం సినిమాను నిర్మించిన నన్నపనేని సోదరులు అయిన అంకప్ప చౌదరి అన్న రావు ఇద్దరూ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు.

కానీ అనుకోకుండా కారణం ఏమో తెలీదు కానీ ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.ఆ తరువాత హీరో కృష్ణ డ్రాప్ అయ్యారు అని తెలియగానే నరసింహారావు 30 లక్షలకు పద్మాలయా వారి దగ్గర కొని అబ్బాయిగారు పేరుతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.అందులో హీరోగా విక్టరీ వెంకటేష్ నటించారు.
ఇక ఆ సినిమా ప్రారంభోత్సవానికి హీరో కృష్ణ కూడా హాజరయ్యారు.తొలి క్లాప్ ఇచ్చి సినిమా షూటింగ్ ప్రారంభించారు.
అలా 1993 సెప్టెంబర్ 30 న విడుదలైన అబ్బాయిగారు సినిమా ఘన విజయాన్ని సాధించింది.అయితే ఈ సినిమా విడుదల కాకముందే వెంకటేష్ నటించిన చంటి సినిమా రికార్డులను క్రాష్ చేస్తుంది అని హీరో కృష్ణ ముందుగానే చెప్పాడు.
కృష్ణ చెప్పిన విధంగానే అబ్బాయిగారు సినిమా చంటి సినిమా కలెక్షన్లను క్రాస్ చేసింది.