సింథాల్ సబ్బు పుట్టడం వెనక ఎంతో ఆసక్తి కరమయిన కధ ఉంది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని తమకు నచ్చినట్టు సబ్బులు తయారు చేసుకుంటున్నారు.
కానీ గతంలో అలాంటి పరిస్థితి ఉండేది కాదు.కేవలం కొన్ని దేశాలు మాత్రమే సబ్బును తాయారు చేసేవి.
అది ఎలా చేస్తున్నారో కూడా ఎవరికి తెలియనిచ్చేవి కావు.అమెరికా మరియు బ్రిటన్ వంటి దేశాల్లో మాత్రమే స్నానికి సబ్బు వాడేవారు.
అందులో వాడే ఫార్ములా కూడా అత్యంత గోప్యంగా ఉండేది.కానీ 1930 లలో Dr.
బుర్జోర్ గోద్రెజ్ అనే ప్రముఖ వ్యాపారవేత్తకు ఇండియాలో సబ్బులను తయారు చేయాలనే కోరిక ఉండేది.దాని కోసం పరిశోధన చేయడానికి జర్మనీ కి వెళ్లారు.
కానీ రీసెర్చ్ డాకుమెంట్స్ సబ్మిట్ చేసేలోపే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది.దాంతో Ph.D ఫినిష్ అవ్వకుండానే తిరిగి ఇండియా కు వచేసాడు.అయితే బ్రిటన్, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న సబ్బుల తయారీ విధానాన్ని తెలుసుకున్నాక అందులో పంది కొవ్వు లేదంటే సొర చేప కొవ్వును వాడుతున్నారని గ్రహించాడు.
ముఖ్యంగా pears సబ్బులో కొవ్వు శాతం ఎక్కువట.కానీ ఆలా పంది కొవ్వు తో తయారు చేస్తే ఇండియాలో అధికంగా ఉన్న ముస్లిమ్స్ ఆ సబ్బులను వాడారు.
అలాగే సొర చేప కొవ్వుతో చేసితే హిందువులు కొనరు జంతువులకు సంబంధం లేకుండా ప్రత్యమ్నాయంగా కొబ్బరి నూనె వాడి సబ్బు తయారు చేయాలనీ అనుకున్నాడు.
అందుకోసం తీవ్రంగా పరిశోధన చేసాడు.ఆ సమయంలో అతడికి ఫెనొల్ [Phenol – C6H6O] కి సంబందించిన ఒక విషయం తెలిసింది.దీనికి శరీరాన్ని శుబ్రపరిచే గుణం తో పాటు సువాసన ఇచ్చే గుణం కూడా ఉన్నట్టు కనిపెట్టాడు.
అయితే ఆమ్లా గుణం ఉన్న ఫెనోల్ కాకుండా సింథటిక్ ఫినోల్ ని కనిపెట్టాడు బుర్జోర్ గోద్రెజ్.అలాగే దీనికి పేటెంట్ కూడా చేయించాడు.దీనికి పేరు పెట్టడం కోసం బాగా అలోచించి SYNTHetic + phenOL = SYNTHOL గా పెట్టాడు.ఆలా సింథాల్ సబ్బు పుట్టింది.
ఆలా అందరి మనోభావాలను అర్ధం చేసుకొని 1940 లలో Dr.బుర్జోర్ గోద్రెజ్ చాల కష్టపడి వారి నిబద్ధతను నిరూపించుకొని సింథాల్ ని కనిపెట్టాడు.ఇప్పటికి ఆ సబ్బు అలాగే తన అమ్మకాలను పెంచుకుంటూ మార్కెట్ లో తనకంటూ మంచి పేరుతో జనాదరణ పొందుతూ ఉంది.