కొత్త వేరియంట్ కలకలం.. ఆ దేశాల నుంచి విమానాలు నిలిపివేయండి : మోడీకి కేజ్రీవాల్ సూచన

ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ప్రపంచదేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే.దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ కొత్త రకం బొట్సువానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయిల్ మీదుగా ఇప్పుడు డెన్మార్క్‌లో అడుగుపెట్టి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

 Stop Flights From Countries Hit By New Variant: Delhi Cm Arvind Kejriwal To Pm N-TeluguStop.com

గతంలోని వేరియంట్ల కంటే ఊహించనంత వేగంగా ఇది వ్యాపిస్తుండడంతో….ముప్పు ఏ స్థాయిలో ఉంటుందనేదానిపై శాస్త్రవేత్తలు సైతం నిర్ధారణకు రాలేకపోతున్నారు.

ఈ వేరియంట్‌పై పరిశోధనల్లో వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకం కానున్నాయి.దక్షిణాఫ్రికాలో వేరియంట్ వెలుగుచూడగానే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.

బ్రిటన్, సహా యూరప్ దేశాలు, అమెరికా….దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి.

గతంలో కరోనా కల్లోలాన్ని స్వయంగా అనుభవించి ఇంకా కోలుకోని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి ఒమిక్రాన్ వేరియంట్ భారతదేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు.

కరోనా నుంచి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అందువల్ల మనదేశంలోకి కొత్త వేరియంట్ అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.అందుచేత ఈ వైరస్ వెలుగుచూసిన ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమాన సర్వీసుల్ని తక్షణం నిలిపివేయాలని ఢిల్లీ సీఎం కోరారు.

ఎంతో కృషి, ఎన్నో కష్టాలు, ఎంతోమందిని కోల్పోయిన తరువాత మన దేశం కరోనా నుంచి కోలుకుందని కేజ్రీవాల్ గుర్తుచేశారు.

Telugu Belgium, Botswana, Corona, Delhicm, European, General Civil, Hong Kong, B

అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం వెల్లడించింది.కేంద్ర హోం వ్యవహారాలు, ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత పరిస్థితులను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

కరోనా రిస్కులేని దేశాలు, కరోనా రిస్కు ఉన్నా మన దేశంతో ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని కలిగి ఉన్న దేశాలు, కరోనా రిస్కు ఉండి మన దేశంలో ఎయిర్ బబుల్ ఒప్పందం లేని దేశాలుగా కేంద్రం ఇటీవల విభజించింది.ఈ విభజన ఆధారంగానే విమానాల్లో ప్రయాణికుల సామర్థ్యాన్ని నిర్ధేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube