స్టేషన్ ఘన్ పూర్: సర్పంచ్ నవ్యకు షాక్..కాంగ్రెస్ ఆఫరిస్తుందా..?

ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజల దగ్గరికి వెళుతూ ఉంటారు.ఇప్పటికే తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ( BRS ) పార్టీ ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచార హోరులో మునిగిపోవాలని సంకేతాలు అందజేసింది.

 Station Ghanpur: Shock For Sarpanch Navya Will Congress Offer , Congress , Stati-TeluguStop.com

ఈ తరుణంలోనే 115 నియోజకవర్గాల అభ్యర్థులను డిక్లేర్ చేసింది.కానీ స్టేషన్ ఘన్పూర్( Station Ghanpur ) , జనగాం ఇంకా కొన్ని నియోజకవర్గాలలో సస్పెన్స్ నెలకొంది.

ఘన్ పూర్ లో కడియం శ్రీహరికి టికెట్ కేటాయించింది కానీ చివరికి బీఫామ్ వస్తుందా రాదా అనేదానిపై ప్రశ్నార్థకంగా మారింది.ఈ సందర్భంలోనే రాజయ్య ( Rajaiah ) కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఆయనకు కూడా టికెట్ వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

Telugu Cm Kcr, Congress, Mutthiyadagiri, Sarpanch Navya, Ghanpoor-Politics

ప్రజల వద్దకు వెళుతూ తన బాధను వెళ్లిబుచ్చుతూ ప్రచారంలో మునిగిపోతున్నారు.ఇలా స్టేషన్ ఘన్పూర్ లో ఓవైపు కడియం శ్రీహరి( Kadiyam Srihari ) , మరోవైపు తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ పడుతుంటే, మధ్యలో వచ్చింది జానకిపురం సర్పంచ్ నవ్య.కేసీఆర్, కేటీఆర్ సార్ స్పందించి నాకు టికెట్ కేటాయిస్తే ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని బీఆర్ఎస్ ( BRS ) అధిష్టానానికి అభ్యర్థిస్తోంది.

Telugu Cm Kcr, Congress, Mutthiyadagiri, Sarpanch Navya, Ghanpoor-Politics

ఈ విధంగా స్టేషన్ ఘన్పూర్ లో ముగ్గురు నాయకుల నుంచి టికెట్ కోసం పోటీ ఏర్పడింది.మరి చివరికి అధిష్టానం బీఫామ్ ఎవరికి ఇస్తుంది.అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

ఇదే క్రమంలో కాంగ్రెస్ ( Congress ) పార్టీ అసమ్మతి నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు ఎదురుచూస్తోంది.ఒకవేళ కడియంకు టికెట్ వస్తే రాజయ్య లేదంటే నవ్యకు కాంగ్రెస్ టికెట్ ఆఫర్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

మరి చూడాలి స్టేషన్ ఘన్పూర్ (Station Ghanpur) లో ముందు ముందు రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరుగుతాయో చూద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube