టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లికి ముందు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉంటున్నారు.తనకు నచ్చిన విధంగా జీవనం సాగించడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు.
తమిళంలో, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్లను సొంతం చేసుకుంటూ సమంత సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.తనపై ట్రోల్స్ వచ్చినా వాటిని ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదు.
లగ్జరీ లైఫ్ కు ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో సమంత ఒకరు అనే సంగతి తెలిసిందే.చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చేసే ప్రతి పని గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
తాజాగా సమంత ఎయిర్ పోర్టులో కారులో దిగగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.సమంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ఎయిర్ పోర్టులో కనిపించడం గమనార్హం.
సమంత ఈ కారును కొనుగోలు చేసిందా లేక ఆ కారు ఇతరులదా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.ఈ కారు విలువ ఏకంగా 7 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.శాకుంతలం షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసిన సమంత యశోద, ఖుషి సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ సినిమాలతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని సమంత భావిస్తున్నారు.

సమంత తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.విడాకుల తర్వాత ప్రేక్షకుల్లో సమంతకు ఎంత క్రేజ్ ఉందో ఈ సినిమా ఫలితాలను బట్టి తేలిపోనుంది.అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సమంతపై కోపంగా ఉన్నారు.
భవిష్యత్తులో కూడా అక్కినేని అభిమనుల సపోర్ట్ సమంతకు లభించడం కష్టమేనని సమాచారం.సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
.