పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ప్రస్తుతం అన్ స్టాబుల్ సీజన్2 కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తుండగా కొన్నిరోజుల క్రితం విడుదలైన ప్రోమోలలో బాలయ్య భీమ్లా నాయక్ సినిమా గురించి కామెంట్ చేసిన సంగతి తెలిసింది.ప్రస్తుతం ఆహాలో ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుండటంతో బాలయ్యకు భీమ్లానాయక్ సినిమాకు గల సంబంధం వెలుగులోకి వచ్చింది.
భీమ్లా నాయక్ కథలో నటించడానికి పవన్ సరైన ఆప్షన్ అని తాను సూచించానని బాలయ్య వెల్లడించడం గమనార్హం.ఈ విషయం తెలిసిన నెటిజన్లు బాలయ్యకు పవన్ పై ఇంత ప్రేమా అని కామెంట్లు చేస్తున్నారు.
నిర్మాత నాగవంశీ కొంత సమయం పాటు షోలో సందడి చేశారు.హీరోగా ట్రై చేస్తున్నావా అని బాలయ్య నాగవంశీని అడగగా లేదు సార్ అని ఆయన సమాధానం ఇచ్చారు.
ఫిట్ గా ఉందామని జిమ్ కు వెళుతున్నానని నాగవంశీ తెలిపారు.

ఆ తర్వాత బాలయ్య చూడటానికి స్వాతిముత్యంలా ఉంటాడు కానీ నిజమైన డీజే టిల్లు నాగవంశీ అని కామెంట్ చేశారు.భీమ్లా నాయక్ కు ఫస్ట్ హీరో ఎవరు అని అడగగా మీరే సార్ అని నాగవంశీ సమాధానం ఇచ్చారు.మీరే కదా సార్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందని సూచించారని నాగవంశీ చెప్పుకొచ్చారు.

నా వల్ల నీకు పని అయిందిగా అని బాలయ్య అడగగా అయింది సార్ అని నాగవంశీ సమాధానం ఇచ్చారు.వరుసగా హిట్లు కదా డబ్బులు ఏం చేస్తున్నావని అడగగా నెక్స్ట్ సినిమాలపై ఇన్వెస్ట్ చేస్తున్నామని నాగవంశీ తెలిపారు.ఆ తర్వాత బాలయ్య త్రివిక్రమ్ తో ఫోన్ లో మాట్లాడి త్రివిక్రమ్ పవన్ తో అన్ స్టాపబుల్ కు రావాలని పరోక్షంగా సూచించడం గమనార్హం.