వెంకటేష్(Venkatesh).ఈ హీరో సినిమా అంటే చిన్నపిల్లవాడి నుండి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.
ఎందుకంటే ఈయన సినిమాల్లో కామెడీ,యాక్షన్, ఫ్యామిలీకి సంబంధించిన సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి.
ఇక ఈయన ఎలాంటి పాత్రలోనైనా నటించగల సత్తా ఉన్న హీరో.
ఇక వెంకటేష్ నటించిన చంటి (Chanti) సినిమాకి అప్పట్లో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందాయి.అయితే అలాంటి వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ (Saindhav) సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ విషయం పక్కన పెడితే అంత పెద్ద హీరో అయినా విక్టరీ వెంకటేష్ ని ఓ డైరెక్టర్ షూటింగ్ సైట్లో అందరూ చూస్తుండగానే చెంప చెల్లుమనిపించారట.మరి వెంకటేష్ ని కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరు.
అసలు చెంపపై కొట్టేంత తప్పు వెంకటేష్ ఏం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
విక్టరీ వెంకటేష్ హీరోగా దివంగత హీరోయిన్ దివ్యభారతి హీరోయిన్ గా వచ్చిన బొబ్బిలి రాజా (Bobbili Raja) సినిమా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు.
ఈ సినిమా 1990లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అయితే ఈ సినిమా ఫస్టాఫ్ పూర్తిగా అడవిలోనే కనిపిస్తుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు చాలావరకు అడవిలోనే షూటింగ్ చేశారట డైరెక్టర్ బి గోపాల్.
ఇక క్రూర మృగాల మధ్య అన్ని రోజులు షూటింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు.అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో వెంకటేష్ జీవితంలో ఒక చెడు సంఘటన జరిగిందట.అదేంటంటే ఓరోజు వెంకటేష్ షూటింగ్ అయిపోగానే చెట్టు కింద కాస్త అలసటగా కుర్చీ మీద కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు పడుకున్నారట.
ఇక అదే సమయంలో వెంకటేష్ మొహంపై ఒక విషపు పురుగు పడిందట.అయితే ఆ పురుగును చూసిన దర్శకుడు గోపాల్ (Director B Gopal) అందరూ చూస్తుండగానే పరిగెత్తుకు వెళ్లి వెంకటేష్ చెంప చెల్లుమనిపించారట.
అయితే వెంకటేష్ ని అలా ఎందుకు కొట్టారో కాసేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదు.కానీ తర్వాత గోపాల్ గారు అసలు విషయం చెప్పారట.వెంకటేష్ పై విషపు పురుగు పడింది ఒకవేళ అది కుడితే వెంకటేష్ (Venkatesh) బాడీలో విషం చేరుతుంది.అందుకే అలా కొట్టాల్సి వచ్చింది అని అన్నారట.ఇలా ఆరోజు వెంకటేష్ పెద్దగండం నుంచి బయటపడట్లైంది అని సినిమా యూనిట్ వాళ్ళు అందరూ అనుకున్నారట.