సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు ఏం చేశారో మీకు తెలుసా?

టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉద్యోగిగా తన జీతంతో పాటు ఇతర ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను బాగానే చదివేవాడినని 61 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నానని కోట శ్రీనివాసరావు చెప్పారు.

 Actor Kota Sreenivasarao Bank Job Details, Actor Kota Sreenivasarao, Bank Job,-TeluguStop.com

ఇప్పుడు నూటికి నూరు శాతం మార్కులు వస్తున్నాయని అప్పట్లో ఎక్కువ మార్కులు వచ్చేవి కాదని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.డాక్టర్ కావాలని భావించి తాను చదివానని సీటు రాకపోవడంతో ఒక సీటు కోసం డొనేషన్ ఐదు వేలు అడిగారని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

నాన్న అవసరమైతే అప్పు చేసి చదివిస్తానని చెప్పారని ఆయితే డొనేషన్ మాత్రం కట్టనని అన్నారని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.అయితే తెలిసిన చోట్ల ప్రయత్నించినా సీటు రాకపోవడంతో పాటు మూడు నెలల సమయం వృథా అయిందని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.

అకడమిక్ ఇయర్ మిస్ అయితే ఇబ్బందులు తప్పవని భావించి ఏలూరు కాలేజీలో డిగ్రీ కోసం చేరానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

మూడు సంవత్సరాలలో డిగ్రీ పూర్తి చేసి బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేశానని 1966లో బ్యాంక్ ఉద్యోగంలో చేరానని కోట శ్రీనివాసరావు తెలిపారు.

Telugu Rupees Salary, Bank Job, Hyderabad, Yana Guda, Tollywood, Unhealhty-Movie

ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాలకు పెళ్లి జరిగిందని పెళ్లైన మూడు నెలలకు జాబ్ పర్మినెంట్ అయిందని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.అప్పట్లో తన జీతం 130 రూపాయలు అని కోట శ్రీనివాసరావు తెలిపారు.పంతొమ్మిదిన్నర సంవత్సరాలు బ్యాంక్ జాబ్ చేశానని చివరగా తాను తీసుకున్న జీతం 800 రూపాయలు అని కోట శ్రీనివాసరావు తెలిపారు.నందిగామలో పని చేస్తున్న సమయంలో భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్ కు ట్రాన్సఫర్ చేయించుకున్నానని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Telugu Rupees Salary, Bank Job, Hyderabad, Yana Guda, Tollywood, Unhealhty-Movie

నారాయణగూడ బ్రాంచ్ లో చేరిన తర్వాత ప్రమోషన్లు ఇచ్చినా వద్దనుకున్నానని తాను ప్రమోషన్ వద్దనుకోవడానికి ఒక కారణం కుటుంబం అయితే మరో కారణం నాటకమని కోట శ్రీనివాసరావు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube