సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు ఏం చేశారో మీకు తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉద్యోగిగా తన జీతంతో పాటు ఇతర ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను బాగానే చదివేవాడినని 61 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నానని కోట శ్రీనివాసరావు చెప్పారు.
ఇప్పుడు నూటికి నూరు శాతం మార్కులు వస్తున్నాయని అప్పట్లో ఎక్కువ మార్కులు వచ్చేవి కాదని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
డాక్టర్ కావాలని భావించి తాను చదివానని సీటు రాకపోవడంతో ఒక సీటు కోసం డొనేషన్ ఐదు వేలు అడిగారని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
నాన్న అవసరమైతే అప్పు చేసి చదివిస్తానని చెప్పారని ఆయితే డొనేషన్ మాత్రం కట్టనని అన్నారని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అయితే తెలిసిన చోట్ల ప్రయత్నించినా సీటు రాకపోవడంతో పాటు మూడు నెలల సమయం వృథా అయిందని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.
అకడమిక్ ఇయర్ మిస్ అయితే ఇబ్బందులు తప్పవని భావించి ఏలూరు కాలేజీలో డిగ్రీ కోసం చేరానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
మూడు సంవత్సరాలలో డిగ్రీ పూర్తి చేసి బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేశానని 1966లో బ్యాంక్ ఉద్యోగంలో చేరానని కోట శ్రీనివాసరావు తెలిపారు.
"""/"/ ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాలకు పెళ్లి జరిగిందని పెళ్లైన మూడు నెలలకు జాబ్ పర్మినెంట్ అయిందని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
అప్పట్లో తన జీతం 130 రూపాయలు అని కోట శ్రీనివాసరావు తెలిపారు.పంతొమ్మిదిన్నర సంవత్సరాలు బ్యాంక్ జాబ్ చేశానని చివరగా తాను తీసుకున్న జీతం 800 రూపాయలు అని కోట శ్రీనివాసరావు తెలిపారు.
నందిగామలో పని చేస్తున్న సమయంలో భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్ కు ట్రాన్సఫర్ చేయించుకున్నానని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.
"""/"/
నారాయణగూడ బ్రాంచ్ లో చేరిన తర్వాత ప్రమోషన్లు ఇచ్చినా వద్దనుకున్నానని తాను ప్రమోషన్ వద్దనుకోవడానికి ఒక కారణం కుటుంబం అయితే మరో కారణం నాటకమని కోట శ్రీనివాసరావు తెలిపారు.
ప్రభాస్ బన్నీ తర్వాత ఆ స్థాయి ఎవరిది.. ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా?