బాలయ్యే కాదు చిరంజీవి సినిమాలో కూడా శ్రీలీలే హీరోయిన్.. ట్విస్ట్ ఏంటంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరో అయినా తమ సినిమాలలో హీరోయిన్ రోల్ కోసం మొదట శ్రీలీలను ( Srileela ) సంప్రదిస్తున్నారు.శ్రీలీల సినిమాలో నటిస్తే సినిమా బిజినెస్ కు ప్లస్ కావడంతో పాటు ఆ సినిమాలకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.

 Srileela Playing Key Role In Chiranjeevi Movie Details, Srileela, Chiranjeevi, D-TeluguStop.com

పాత్ర నచ్చితే ఎలాంటి రోల్ అయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా శ్రీలీలకు ఒక విధంగా ప్లస్ అవుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Telugu Anil Ravipudi, Balakrishna, Chiranjeevi, Kalyan Krishna, Srileela, Srilee

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో సినిమాలో బాలయ్య( Balakrishna ) కూతురి రోల్ లో కనిపిస్తున్న శ్రీలీల చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబో సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యారని సమాచారం.అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ కనిపిస్తారని ఆ పాత్రకు జోడీగా శ్రీలీల ఉంటారని తెలుస్తోంది.ఇప్పటికే చేతినిండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Chiranjeevi, Kalyan Krishna, Srileela, Srilee

శ్రీలీల పారితోషికం సైతం పరిమితంగానే ఉండటంతో నిర్మాతలు ఈ బ్యూటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.సీనియర్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు ఒక హీరోయిన్ కు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం కేవలం శ్రీలీల విషయంలోనే జరుగుతోంది.చిరంజీవి( Chiranjeevi ) కళ్యాణ్ కృష్ణ కాంబో సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని సమాచారం అందుతోంది.ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం శ్రీలీల నామ జపం చేస్తోంది.

Telugu Anil Ravipudi, Balakrishna, Chiranjeevi, Kalyan Krishna, Srileela, Srilee

సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు.తన సినిమాలలో మరో హీరో ఉండేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ విధంగా చేయడం ద్వారా సినిమాల బిజినెస్ కు సైతం ఒకింత ప్లస్ అవుతోంది.డేట్లు అడస్ట్ చేసుకుంటామని చెబితే పెద్ద ప్రాజెక్ట్ లకు శ్రీలీల సులువుగానే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube