ఎలాన్ మస్క్‌పై నోరు పారేసుకున్న ఉక్రెయిన్ రాయబారి.. చివరి ట్విస్ట్ తెలిస్తే..!

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్ శాంతి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ప్రతిపాదన పలు వివాదాలకు దారి తీసింది.

 Spacex Cannot Fund Starlink In Ukraine Elon Musk Requests Pentagon To Pay,elon M-TeluguStop.com

చాలామంది ఎలాన్ మస్క్‌కి మద్దతుగా నిలుస్తుంటే.మరికొంతమంది మాత్రం అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాయబారి ఆండ్రిజ్ మెల్నిక్ సైతం మస్క్‌పై నోరు పారేసుకున్నాడు.మస్క్‌ని ఉద్దేశిస్తూ “దుబ్బేయండి” అని తన నోటి దురుసును ప్రదర్శించాడు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎలాన్ మస్క్ ఫ్రీగా ఇచ్చిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఒక గేమ్ చేంజర్‌గా నిలిచిందని అనడంలో సందేహం లేదు.

ఐతే అలాంటి మస్క్‌పై అహంకార కూతలు కూయడంతో అతను బాగా నొచ్చుకున్నారు.

అలానే ఆండ్రిజ్ చెప్పినట్లే ఉక్రెయిన్ దేశం నుంచి వెళ్ళిపోతామని సింపుల్‌గా చెప్పేసారు.దీంతో ఉక్రెయిన్ దేశానికి ఫ్రీ ఇంటర్నెట్ ఇకపై ఉండదని తేలిపోయింది.

నిజం చెప్పాలంటే.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన కాలం నుంచే ఉక్రెయిన్‌కి ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తూ అండగా నిలిచారు మస్క్.

కానీ అతనిపైనే ఆండ్రిజ్ దుర్భాషలాడి తప్పు చేశాడు.అందుకే మస్క్ ఫ్రీగా నెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.

ఆ కారణంగానే తమ సేవలకు ఫండింగ్ ఇవ్వండంటూ అమెరికా ప్రభుత్వానికి ఒక లేఖ సైతం పంపించారు.ఆ లేఖలో స్టార్‌లింక్ సర్వీస్ కోసం ఇక నుంచి డబ్బులు చెల్లించాలని నిర్మొహమాటంగా అడిగారు.

ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవలు కొనసాగాలంటే 120 మిలియన్ల డాలర్ల వరకు పే చేయాలని స్పేస్ఎక్స్ సంస్థ పెంటగాన్‌కి రిక్వెస్ట్ చేస్తోంది.ఈ ఏడాది కాకుండా 2023కి కూడా 400 మిలియన్ డాలర్లు చెల్లించాలని పెంటగాన్‌కి మస్క్ సంస్థ తెలియజేసినట్లు సమాచారం.ఏది ఏమైనా ఉక్రెయిన్ రాయబారి ఆండ్రిజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశం కొంప ముంచుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube