దొంగలు, కిరాతకుల నుంచి సామాన్య ప్రజలను రక్షించే రక్షకభటులుగా పోలీసులను మనం ఎంతో గౌరవిస్తుంటాం.కానీ ఈ రోజుల్లో కొందరు పోలీసులు చేసే చెడ్డ పనులు వారి వృత్తికే తలవంపులు తెచ్చిపెడుతున్నాయి.
అమాయకులను కొట్టడం, లంచాలు తీసుకోవడం వంటి ఆరోపణలు వీరిపై ఎప్పటి నుంచో వస్తున్నాయి.ఇక పోలీసులై ఉండి దొంగల్లాగా కూడా ప్రవర్తిస్తున్నారనే దుష్కీర్తి కూడా ఉంది.
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చాలా వరకు అధికారులు సిన్సియర్‌గా పనిచేసినా కొందరి వల్ల ఖాకీలపై అవినీతి, దొంగతనమనే దుష్కీర్తి ఇంకా పెరుగుతుందే తప్ప తరుగు పడటం లేదు.ఈ మాటలను నిజం చేస్తూ తాజాగా ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ అడ్డంగా బుక్కయ్యారు.
ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్‌పూర్ ప్రాంతంలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్ధరాత్రి పాన్ షాప్ నుంచి లైట్ బల్బును దొంగలించారు.ఈ షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఆ ఫుటేజ్ ప్రకారం ఈ ఘటన అక్టోబర్ 6న జరిగినట్లు తెలుస్తోంది.దొంగలను పట్టుకోవాల్సిన ఒక ఇన్‌స్పెక్టర్ అయి ఉండి అతనే దొంగగా మారాడని తెలుసుకొని అందరూ అవాక్కవుతున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఫుల్‌పూర్ కొత్వాలిలో ఇన్‌స్పెక్టర్ రాజేష్ వర్మను ఎస్‌ఎస్పీ సస్పెండ్ చేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఇన్‌స్పెక్టర్ రాజేష్ క్లోజ్ చేసి ఉన్న ఒక పాన్ షాప్ వద్దకు వెళ్లడం చూడవచ్చు.తర్వాత అతను తన చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నారో లేదో చెక్ చేసుకున్నారు.ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత షాప్ బయట ఉన్న ఎల్‌ఈడీ బల్బును తీసి తన జేబులో వేసుకుని అక్కడినుంచి తాపీగా చెక్కేశారు.
దసరా మేళా సందర్భంగా రాత్రిపూట నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అతను ఈ దొంగతనం చేశారు.మరుసటి రోజు ఉదయం బల్బు మాయం కావడంతో దీనిని ఎవరు దొంగలించి ఉంటారా అని షాపు ఓనర్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు.
అప్పుడు ఆ బల్బ్ దొంగ ఇన్‌స్పెక్టర్ అని తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు.
అయితే బల్బ్ దొంగలించాల్సిన అవసరం ఏంటి అని అడిగితే.
అతను చెప్పే సమాధానం కూడా చాలా వింతగా ఉంది.వేరే చోట చీకటిగా ఉన్నందున అతను ఈ బల్బును తీసివేసి, తాను ఉన్న ప్రదేశంలో ఉంచాడట.
ఈ సమర్థతను ఉన్నతాధికారులు ఏమాత్రం నమ్మలేదు.ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
ఇంటర్నెట్ యూజర్లు ఈ ఇన్‌స్పెక్టర్‌ని బాగా విమర్శిస్తున్నారు.







