శాడిజానికి ,నియంత్రత్వపు పోకడలకు నిలువుట అద్దంలో కనిపిస్తూ ఉంటారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ లేని కఠినమైన నియమ నిబంధనలు ఉత్తరకొరియాలో అమలవుతూ ఉంటాయి.
ఈ కఠిన ఆంక్షలు కారణంగా అక్కడి ప్రజలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా అంతర్జాతీయ సంస్థలు తమ నివేదికలలో వెల్లడిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం ఉత్తర కొరియా పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుంది.
తినేందుకు కూడా సరైన ఆహారం ప్రజలకు దొరక్క తీవ్ర దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు.అయినా ప్రజల ఆకలిని తీర్చే విషయంపై దృష్టి పెట్టకుండా .క్షిపణి పరీక్షల విషయం పైనే ఎక్కువగా దృష్టి పెడుతూ, అమెరికా సహా చాలా దేశాలకు కిమ్ సవాళ్లు విసురుతూనే వస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక , వరదలు వంటి కారణాలతో దిగుబడులు భారీగా తగ్గిపోయాయి.
అయినా ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు.ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా చేతులెత్తేయడంతో ప్రజలు తినేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత మూడేళ్లుగా కరోనా కారణంగా విధించిన ఆంక్షలు కారణంగా చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే నిత్యవసరాలు ఆగిపోయాయి.ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు అమలు చేయడం, సరిహద్దులను పూర్తిగా మూసివేయడంతో ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది
అయితే ఉత్తర కొరియా ప్రభుత్వం వద్ద భారీగా ఆహార నిలువలు అందుబాటులో ఉన్నా.భవిష్యత్తు అవసరాల కోసం వాటిని దాచి ఉంచారు.దీని కారణంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి.
ప్రజల్లోనూ చాలామందికి కొనుగోలు శక్తి తగ్గడంతో భారీగా పెరిగిన ధరలతో వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం అక్కడ కిలో బియ్యం ధర 220 రూపాయలకు చేరుకుంది.
ప్రస్తుతం ఉత్తర కొరియా ప్రపంచంలోనే అత్యంత నిరుపేద దేశాల జాబితాలో ఉంది. అక్కడి ప్రజల తలసరి ఆదాయం కేవలం 1.3 లక్షలు.ఇక దేశంలో ప్రవేట్ గా ఆహారం, ఆహార ధాన్యాల అమ్మకాన్ని ఎప్పుడో నిషేధించారు.
కానీ గత కొంతకాలంగా ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినడంతో, ప్రైవేట్ అమ్మకాల విషయంలో పట్టించుకోనట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది.ఇక నిధులన్నీ ప్రజల అవసరాలు కోసం కాకుండా, సైన్యానికి ఎక్కువగా ఖర్చు పెడుతుంది.
ఉత్తర కొరియాలో 12 లక్షల మందితో కూడిన ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సైన్యం ఉంది.తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఇటీవలే భారీ సంఖ్యలో ఖండాంతర క్షిపణి లతో నెల క్రితమే అతి పెద్ద సైనిక సరైడ్ ను నిర్వహించారు.
ఈ విధంగా వనరులన్నీ రక్షణ రంగానికి ఎక్కువగా కేటాయిస్తూ ఉండడంతో, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం దక్కడం లేదు.ప్రజలు తినేందుకు తిండి లేక ఈ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.ఆ దేశాధ్యక్షుడు కిమ్ మాత్రం ప్రజలపై ఏమాత్రం కనికరం లేనట్టుగానే వ్యవహరిస్తుండడంతో ప్రపంచ దేశాలు ఆయనపై మండిపడుతున్నాయి.