వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు సంచలనం సృష్టిస్తుంది.ఈ కేసుకు సంబంధించి మొదటి నుండి కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది.
ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి రెండుసార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.అయితే మళ్లీ విచారణకు హాజరుకావాలని ఇటీవల పులివెందులలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది.
మార్చి ఆరవ తారీకు హైదరాబాద్ సీబీఐ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరారు.
ఇక అదే సమయంలో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా కడప కేంద్ర సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో మార్చి ఆరో తారీకు తాను విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలో.లేటెస్ట్ గా మరో నోటీసులు జారీ చేయడం జరిగింది.
ఈనెల 10వ తారీకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.ఇక 12వ తారీకు నాడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డినీ కడప సీబీఐ కేంద్ర కార్యాలయంలో విచారణకు రావాలని సీబీఐ అధికారులు తెలియజేయడం జరిగింది.