ఆస్తిలో చెల్లెళ్లకు వాటా ఇచ్చిన తండ్రిని హతమార్చిన కసాయి కొడుకు..!

ఇటీవల కాలంలో కుటుంబ బంధాల కంటే ఆస్తిపాస్తులకు ( Property ) అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల సంఖ్య పెరుగుతూ పోతోంది.ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను సైతం హత్య చేసేందుకు వెనుకాడరు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

 Son Takes Life Of Father For Sharing Property With Daughters Details, Son , Fath-TeluguStop.com

ఆస్తిలో కొంత భాగం చెల్లెళ్లకు( Sisters ) ఇచ్చిన తండ్రిపై దాడి చేసి హత్య చేసిన ఘటన జనగామ జిల్లాలో( Janagama District ) చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.పాలకుర్తి మండలం సిరిసన్న గూడెంలో నివాసం ఉంటున్న గాయాల వెంకటయ్య (70), వెంకటమ్మ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం.ఈ దంపతులు తమ పిల్లలందరికీ తహతకు తగ్గట్టుగా వివాహం జరిపించారు.వెంకటయ్య( Venkatayya ) తనకు ఉండే ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో రెండు ఎకరాలు తన పేరిట ఉంచుకొని మిగతా ఆరెకరాల భూమిని కుమారుడికి రాసి ఇచ్చాడు.

అయితే పెద్ద కుమార్తె రేణుక,( Renuka ) చిన్న కుమార్తె లక్ష్మీ లకు( Lakshmi ) పసుపు, కుంకుమల కింద మొత్తం ఎకరం భూమిని ఇస్తానని అప్పట్లో వెంకటయ్య ఒప్పుకున్నాడు.

Telugu Daughters, Janagama, Lakshmi, Renuka, Son, Venkatayya-Latest News - Telug

వెంకటయ్య తాను ఒప్పుకున్న ప్రకారమే గత నెలలో ఇద్దరు కూతుర్లకు చేరో 20 గుంటల చొప్పున భూమిని పట్టా చేయించాడు.అప్పటినుంచి వెంకటయ్యకు, అతని కుమారుడికి మధ్య గొడవలు జరగడం మొదలైంది.ప్రతిరోజు ఇద్దరి మధ్య గొడవ జరిగేది.

ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం పొలం వద్ద మళ్లీ ఈ తండ్రి, కొడుకుల మధ్య మొదలైన చిన్న గొడవ పెను తుఫానులా మారింది.

Telugu Daughters, Janagama, Lakshmi, Renuka, Son, Venkatayya-Latest News - Telug

ఆగ్రహానికి లోనైన కుమారుడు క్షణికావేశంలో పక్కనే ఉన్న కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టడంతో తండ్రి వెంకటయ్య అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై తాళ్ల శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ హత్య ఘటన తో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube