'వారసుడు' రాకతో ట్రెండింగ్ లో మహర్షి 2.. వంశీని ఆడుకుంటున్న ఫ్యాన్స్!

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు విజయ్ దళపతి.

 Social Media Viral Comments On Varasudu First Look Poster, Varasudu First Look,-TeluguStop.com

ఈయన సినిమా వస్తుంది అంటే ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈయన సినిమాలు కూడా కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తాయి.

ఈ రోజు విజయ్ దళపతి పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.ఈ సందర్భంగా ఈయనకు పుట్టిన రోజు గిఫ్ట్ గా ఒకరోజు ముందుగానే ఈయన సినిమా నుండి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు.

ఇప్పుడు విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

Telugu Varasudu Poster, Thapalathy, Varasudu-Movie

ఈ సినిమా టైటిల్ ను నిన్న సాయంత్రం రివీల్ చేసారు.వారసుడు అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.ఇందులో విజయ్ సూటు బూటు తో స్టైలిష్ గా కనిపించాడు.అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఇది మహర్షి 2 కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఎందుకంటే మహర్షి సినిమాలో మహేష్ బాబు కూడా ఇలాంటి లుక్ లోనే కనిపించాడు.

ఇప్పుడు వారసుడు పోస్టర్ కూడా అదే విధంగా ఉండడంతో ఈయనపై ట్రోల్ చేస్తున్నారు.విజయ్ లుక్ ని బట్టి ఈయన కూడా సీఈఓ అనే అర్ధం అవుతుంది అంటున్నారు.

దీంతో వారసుడు టైటిల్ తో పాటు మహర్షి 2 టైటిల్ కూడా ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది.అయితే మహర్షి 2 ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ అది ఓపెన్ చేస్తే మహర్షి పేరు ఎక్కడ కనిపించకుండా వారసుడు సినిమాకు సంబందించిన అంశాలు మాత్రమే కనిపిస్తుండడంతో ట్విట్టర్ కూడా ఈయనపై ట్రోల్ చేస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మొత్తానికి వంశీ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube