నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కు వచ్చిన భారీ హైప్ నేపథ్యం లో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 975 స్క్రీన్లలో సినిమా ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా సమాచారం అందుతోంది.
తెలుగు రాష్ట్రంలోనే ఈ సినిమాను దాదాపుగా 700 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు.ఓవర్సీస్లో 210 స్క్రీన్ కి పైగా విడుదల చేయబోతున్నారట.
ఈ నేపథ్యంలో భారీగా ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.మరోవైపు బింబిసార కు పోటీ గా రాబోతున్న సీతారామం సినిమా ని ప్రపంచ వ్యాప్తంగా 860 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.
వైజయంతి మూవీస్ వారి ఆధ్వర్యం లో విడుదల కాబోతున్న ఈ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో 350 స్క్రీన్లలో ప్రేక్షకులు చూడబోతున్నారు.
బింబిసార సినిమా తో పోలిస్తే సీతారామం సినిమా ను కాస్త తక్కువగానే స్క్రీన్ ల్లో విడుదల చేస్తున్నారు, కానీ ఖచ్చితం గా రెండు సినిమాలు కూడా వసూళ్ల విషయం లో డి అంటే డి అన్నట్లుగా ఉండబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ కి చాలా కాలం తర్వాత ఒక డీసెంట్ ఓపెనింగ్ వీక్ అయితే పడబోతుంది అంటూ థియేటర్ల సంఖ్య చూస్తుంటే అనిపిస్తుంది.మరో వైపు దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో కాకున్నా కూడా కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఒక తెలుగు సినిమా హీరో రేంజ్ కి చేరే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొన్ని గంటల్లో ఈ సినిమా లు రెండు కూడా థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.మరి ఏ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.