మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే హెయిర్ ఫాల్ ను అధికం చేస్తుంది.. తెలుసా?

హెయిర్ ఫాల్.దాదాపు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

 These Small Mistakes That You Make Can Increase Hair Fall, Hair Fall, Heavy Hair-TeluguStop.com

అందులోనూ కొందరిలో జుట్టు రాలడం అనేది చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది.ఇలాంటి వారు ఎంతగానో హైరానా పడిపోతుంటారు.

జుట్టు రాలకుండా అడ్డుకునేందుకు రకరకాల హెయిర్ ప్యాక్ లు, మాస్కులు వేసుకుంటారు.కానీ అసలు ఎందుకు జుట్టు అధికంగా ఊడుతుంది అన్నది మాత్రం ఆలోచించరు.

నిజానికి మీరు చేసే కొన్ని కొన్ని పొరపాట్ల వల్లే హెయిర్ ఫాల్ అనేది అధికం అవుతుంది.

చాలా మంది తలస్నానం చేసిన వెంటనే నిద్రపోతుంటారు.జుట్టు రాలడానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు.తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల కురులు బలహీనంగా మారతాయి.

దీంతో జుట్టు అధికంగా రాలిపోతుంటుంది.అందుకే జుట్టును సహజ పద్ధతుల్లో పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాతే నిద్ర పోవడం మంచిది.

కొంతమంది జుట్టు ఎక్కడ ఊడిపోతుందో అని దువ్వడానికి అస్సలు ఇష్టపడరు.అవసరమైనప్పుడు మాత్రమే జడ వేసుకుంటారు.

కానీ ఇలా దువ్వకుండా జుట్టును వదిలేయడం వల్ల చిక్కులు పడిపోతాయి.ఈ చిక్కుల కారణంగా జుట్టు మరింత ఎక్కువగా ఊడుతుంటుంది.

అలాగే కొందరు బిగుతుగా ఉండే పోనీ వేసుకుని నిద్రపోతుంటారు.ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ లేక జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది.అందుకే నిద్రపోయే సమయంలో జుట్టును వీలైనంతవరకు వద‌లుగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.‌ఎక్కువ శాతం మంది వేడి వేడి నీటితో తల స్నానం చేస్తుంటారు.జుట్టు హెవీగా రాలడానికి ఇది ఒక కారణం అని చెప్పాలి.వేడి వేడి నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు వీక్ గా మారతాయి.

దాంతో జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.ఇక మనలో చాలా మందికి స్లీప్ క్యాప్ లు వేసుకుంటే కానీ నిద్ర పట్టదు.

అయితే ఇవి తలకు గట్టిగా పట్టేసి ఉండటం వల్ల వెంట్రుకలు అధికంగా రాలే అవకాశాలు పెరుగుతాయి.కాబట్టి అధిక హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారు స్లీప్ క్యాప్ ను ఎవైడ్ చేయడమే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube