భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.చంచుపల్లి మండలం రాంపురంలో ఓ చిన్నారి పాలిట మొక్కజొన్న గింజలు శాపంగా మారాయి.
మూడేళ్ల చిన్నారి తెలియక మొక్కజొన్న గింజలను తినేందుకు ప్రయత్నించగా ఊపిరితిత్తుల్లో గింజలు ఇరుకున్నాయని తెలుస్తోంది.దీంతో శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన బిందు శ్రీ ప్రాణాలను కోల్పోయింది.
చిన్నారిని కాపాడేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది.చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.







