తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ( Singer Mangli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పల్లెటూరి పాటలు, దేవుడి పాటలు, సినిమాల పాటలు పాడి భారీగా పాపులాటి సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈమె వెండితెరపై, అలాగే బుల్లితెరపై అవకాశాలతో దూసుకుపోతుంది.మంగ్లీ ఏ సినిమాలో పాట పాడిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
భక్తి పాట అయినా, ఐటమ్ సాంగ్ అయినా మంగ్లీ పాట పాడితే ఆ దాని స్థాయి వేరేలా ఉంటుంది చెప్పవచ్చు.అంతేకాకుండా ఇప్పటివరకు మంగ్లీ పాడిన పాటలు( Mangli Songs ) అన్నీ కూడా మంచి సూపర్ హిట్ గా నిలవడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.
మొదట న్యూస్ యాంకర్ కెరియర్ ను స్టార్ట్ చేసిన మంగ్లీ ఆ తర్వాత స్టార్ సింగర్ గా ( Star Singer ) మారిన విషయం తెలిసిందే.బతుకమ్మ పాటలతో బాగా ఫేమస్ అయ్యి ఆ తర్వాత సినిమాలలో పాటలు పాడే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
అంతే కాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న సింగర్స్ లో మంగ్లీ కూడా ఒకరు అని చెప్పవచ్చు.ఇప్పటికే తెలుగులో సింగర్ మంగ్లీ పాడిన రాములో రాములా , జింతక్ చితక్, ఊరంతా వెన్నెల, సారంగదరియా, జ్వాలా రెడ్డి లాంటి పాటలు యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ ని తెచ్చి పెట్టడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.
సింగర్ మంగ్లీ పాడిన పాటలు బాగా హీట్ అవ్వడంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కింది.
దీంతో ఎక్కడికి వెళ్లినా కూడా సింగర్ మంగ్లీని ప్రేక్షకులు బాగా గుర్తు పడుతున్నారు.అయితే సింగర్ మంగ్లీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది అనడానికి తాజాగా జరిగిన సంఘటన కోదాకండగా చెప్పవచ్చు.తాజాగా మంగ్లీ తిరుమల తిరుపతి( Tirupati ) వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తూ కనిపించింది.
కుటుంబంతో సహా ఆమె స్వామివారిని దర్శించుకొని శ్రీవారీ ఆశీస్సులను అందుకుంది.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.ఇక శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలో మీడియాతో ముచ్చటించింది.వరలక్ష్మీ వ్రతం రోజు ఇలా దర్శించుకోవడం ఆనందంగా ఉందని, శివుడి మీద చాలా పాటలు పాడాను.
వెంకన్న మీద పాటలు పాడాలనే కోరిక మాత్రం ఇంకా తీరలేదని చెప్పుకొచ్చింది.ఇక ఒక్కసారిగా తిరుమలకు మంగ్లీ రావడంతో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు.కేవలం అభిమానులు మాత్రమే కాకుండా పోలీసులు( Police ) సైతం మంగ్లీ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.ఆమెను చుట్టుముట్టి పోలీసులందరూ సెల్ఫీలు( Selfies ) తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఆ వీడియోని చూసిన నెటజన్స్ సింగర్ మంగ్లీ క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.