World Wide Collections : శ్యామ్ సింగరాయ్.. హిట్ టాక్ వచ్చిన నానికి నిరాశే?

నాచురల్ స్టార్ నాని హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్.ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

 World Wide Collections : శ్యామ్ సింగరాయ్.. హిట-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తూ ఉండడంతో ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో అని ఊహాగానాలు కూడా వచ్చాయి.ఇక ఈ సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కింది.

విభిన్నమైన కథలను తెరకెక్కించడంలో రాహుల్ సాంకృత్యాయన్ దిట్ట.దీంతో ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమని నాని అభిమానులందరూ ఫిక్స్ అయిపోయారు.

ఇటీవల డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అనుకున్నట్లుగానే మంచి టాక్ ను సొంతం చేసుకుంది.“సినిమా అదిరిపోయింది.నాని యాక్టింగ్ ఇరగదీశాడు.

సూపర్ ” అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ బయట మీడియా ముందు కామెంట్లు కూడా చేశారు.అంతా బాగానే ఉంది కానీ టాక్ వచ్చినంత అద్భుతంగా కలెక్షన్స్ మాత్రం రాలేదు అని చెప్పాలి.

రిలీజైన మొదటి 2 మూడు రోజులు జోరు చూపించిన కలెక్షన్స్ ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి.ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల కారణంగా కొన్ని థియేటర్లు మూతపడడంతో నాని సినిమాకు పెద్ద దెబ్బ పడింది.

విమర్శకుల సైతం ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ సినిమా వసూళ్ల పరంగా మాత్రం నత్తనడకన ముందుకు సాగుతోంది.

Telugu Krithi Shetty, Nanishyam, Sai Pallavi, Shyam Singa Roy, Tollywood-Movie

ఇక శ్యామ్ సింగరాయ్ పది రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.

నైజాం 9.00 కోట్లు సీడెడ్ 2.45 కోట్లు ఉత్తరాంధ్ర 2.10 కోట్లు ఈస్ట్ 0.96 కోట్లు వెస్ట్ 0.82 కోట్లు గుంటూరు 1.17 కోట్లు కృష్ణా 0.91 కోట్లు నెల్లూరు 0.58 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో : 17.99 కోట్లు ఓవర్సీస్లో : 3.40 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.90 కోట్లు

Telugu Krithi Shetty, Nanishyam, Sai Pallavi, Shyam Singa Roy, Tollywood-Movie

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 24.29 కోట్ల వసూళ్లు రాబట్టింది శ్యామ్ సింగరాయ్ సినిమా.ఇలా మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా మాత్రం యావరేజ్ గానే మిగిలిపోయే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

కొన్ని ప్రాంతాల్లో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేదట.అయితే మొదటి నుంచి ఈ సినిమాపై దాన్ని ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నానీ. కొన్ని రోజుల నుంచి హిట్ కు దూరమైన నాని ఈ సినిమాతో హిట్ కొట్టాలి అనుకున్నాడు.కానీ ప్రస్తుత వసూళ్లు చూస్తే మాత్రం నాని హిట్ టాక్ తో సంతోషంగా ఉన్నప్పటికీ వసూళ్లతో మాత్రం నిరాశ లో ఉన్నాడని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube