ఇంకోసారి తన గురించి అలాంటివి రాస్తే కేసు పెడతానంటున్న హీరోయిన్...

తెలుగులో మొదలు పెట్టిన అనతికాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో గురించి తెలియని వారుండరు.అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ఉంటుందా లేదా అనే సందేహంలో ఉండగా ఇటీవలే షో నిర్వాహకులు కచ్చితంగా ఈ ఏడాది బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ఉంటుందని తొందర్లోనే ప్రసారమయ్యే తేదీలను కూడా ప్రకటిస్తామని ప్రోమోని విడుదల చేస్తూ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

 Shraddha Das, Tollywood Heroine, Big Boss Fake News, Telugu Big Boss Season 4,-TeluguStop.com

అయితే బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో అవుతున్నాయి.

దీంతో తాజాగా ఈ విషయంపై నటి శ్రద్ధా దాస్ స్పందించింది.

ఇందులో భాగంగా తనని బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో నాలుగవ సీజన్లో పాల్గొనమని షో నిర్వాహకులు ఇప్పటి వరకూ సంప్రదించ లేదని స్పష్టం చేసింది.అంతేకాక తను బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో పాల్గొనబోతున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై నిజం లేదని కొట్టిపారేసింది.

అంతేగాక నిజానిజాలు తెలుసుకోకుండా ఇంకోసారి తన గురించి ఇలాంటి వార్తలు రాస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.దీంతో కొందరు నెటిజనులు ఈ విషయం గురించి స్పందిస్తూ సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ విషయం బయటకు వచ్చిందంటే చాలు నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు వాటి గురించి కథలు అల్లుతూ మరిన్ని పుకార్లను సృష్టిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నూతన దర్శకుడు వంశీ కృష్ణ మల్ల దర్శకత్వం వహిస్తున్న  “నిరీక్షణ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే కన్నడలో కూడా ఓ ప్రముఖ హీరో నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube