కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి కారణమైన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

కర్ణాటక రాష్ట్రంలో( Karnataka ) కచ్చితంగా అనుకూల ఫలితాలు వస్తాయని బీజేపీ ( BJP ) భావించగా అందుకు భిన్నంగా జరిగింది.మోదీ ఎంత కష్టపడినా బెంగళూరులో తిరిగి ప్రచారం చేసినా ఆయన పార్టీకి షాకింగ్ ఫలితాలు రావడం బీజేపీని కంగారు పెడుతోంది.

 Shocking Facts About Sunil Kanugolu Details, Sunil Kanugolu, Karnataka Assembly-TeluguStop.com

దక్షిణాది రాష్ట్రాల్లో అనుకూల ఫలితాలను సాధించడం బీజేపీకి సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బీజేపీ ఓటమికి సంబంధించి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే కాంగ్రెస్ ( Congress ) గెలుపుకు కారణమైన వ్యక్తి ఎవరనే ప్రశ్నకు సునీల్ కనుగోలు( Sunil Kanugolu ) పేరు సమాధానంగా వినిపిస్తోంది.కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు మరో ప్రశాంత్ కిషోర్ అయ్యారని సమాచారం.

తెర వెనుక సునీల్ కనుగోలు ఎంతో కష్టపడటం వల్లే కాంగ్రెస్ మరో పార్టీ సహాయం లేకుండా అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంది.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా సునీల్ కనుగోలు కృషి చేశారు.

Telugu Congress, Dk Shivakumar, Strategistsunil, Prashant Kishor, Sunil Kanugolu

2014 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసిన సునీల్ కనుగోలుకు రాబోయే రోజుల్లో ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ రాజకీయ పార్టీలు ప్రస్తుతని సునీల్ కనుగోలుపై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది.

Telugu Congress, Dk Shivakumar, Strategistsunil, Prashant Kishor, Sunil Kanugolu

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పని చేస్తున్న ఈ వ్యక్తి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చేలా చేస్తారేమో చూడాలి.సోషల్ మీడియాలో పెద్దగా కనిపించని సునీల్ కనుగోలు తెర వెనుక వేసే స్ట్రాటజీలు పార్టీల విజయాలలో కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం.కాంగ్రెస్ పార్టీ మరింత కష్టపడితే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కేంద్రంలో అధికారంలోకి వచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube