బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు( Saif Ali Khan ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.తెలుగు రాష్ట్రాల్లో కూడా సైఫ్ అలీ ఖాన్ కు ఊహించని స్థాయిలో మార్కెట్ ఉంది.
సైఫ్ అలీ ఖాన్ దుందగుడి దాడిలో గాయపడగా ప్రస్తుతం ఆ గాయం నుంచి నిదానంగా కోలుకుంటున్నారు.ముంబై పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ సహాయంతో సైఫ్ హౌస్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించడం జరిగింది.
వీడియో ఉన్న నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం( Mohammad Shariful Islam ) అని టెక్నాలజీ ద్వారా పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం అందుతోంది.ఈ నెల 16వ తేదీన నిందితుడు సైఫ్ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు.
విచారణలో భాగంగా అధికారుల బృందం మొత్తం 19 వేలిముద్రలను సేకరించింది.అయితే ఆ వేలిముద్రలలో ( Fingerprints ) ఏ వేలిముద్ర కూడా మ్యాచ్ కావడం లేదని వార్తలు జోరుగా వినిపించాయి.

షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఆలోచనతోనే ఇంట్లోకి ప్రవేశించారని అక్కడ పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారి తీసిందని తెలుస్తోంది.సైఫ్ అలీ ఖన్ కేసు విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.సైఫ్ అలీ ఖాన్ రెమ్యునరేషన్ 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

సైఫ్ అలీ ఖాన్ కు భాషతో సంబంధం లేకుండా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోంది.సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాతో( Devara ) తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.సైఫ్ అలీ ఖాన్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లకు ప్రాధాన్యత ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
సైఫ్ అలీ ఖాన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.రాబోయే రోజుల్లో సైఫ్ కు తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.