టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఒక వెలుగు వెలిగిన వాళ్లలో రాకేశ్ మాస్టర్( Rakesh Master ) ఒకరనే సంగతి తెలిసిందే.రక్త విరేచనాల వల్ల రాకేశ్ మాస్టర్ మృతి చెందగా కల్తీ మద్యమే ఆయన ప్రాణాలు కోల్పోవడానికి కారణమని కొంతమంది కామెంట్లు చేశారు.
ప్రముఖ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పెద్దగా పాపులారిటీ లేని మద్యం బ్రాండ్లను ఎక్కువగా విక్రయిస్తున్నారు.ఆ బ్రాండ్ల మద్యం( Alcohol ) గతంలో రాకేశ్ మాస్టర్ తాగినట్టు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ మద్యం రాకేశ్ మాస్టర్ ప్రాణాలు తీసిందంటూ ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.పోస్టుమార్టం తర్వాతే ఈ ప్రచారం నిజమో కాదో తెలిసే అవకాశం అయితే ఉంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు రాకేశ్ మాస్టర్ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తుండటం గమనార్హం.

రాకేశ్ మాస్టర్ జీవించి ఉన్న సమయంలో ఇంటర్వ్యూలలో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.రాకేశ్ మాస్టర్ ఇక లేరనే విషయాన్ని ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.కొన్ని రోజుల క్రితం వరకు వైజాగ్ లో( Vizag ) షూటింగ్ లో పాల్గొన్న రాకేశ్ మాస్టర్ హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు.
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేశ్ మాస్టర్ దగ్గర శిక్షణ పొందారు.

వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలకు రాకేశ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారని తెలుస్తోంది.సోషల్ మీడియా వేదికగా రాకేశ్ మాస్టర్ మరణ వార్త తెలిసి పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.రాకేశ్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.